Saudi Arabia Women Jobs: సౌదీలో బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి 30 వేలమంది మహిళలు దరఖాస్తు..అభ్యుదయం దిశగా అతివల అడుగులు..
సౌదీ అరేబియాలో బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి 30 వేలమంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల పాటు ఆంక్షల్లో మగ్గిపోయిన సౌదీ అతివలు అభ్యుదయం దిశగా అడుగులు వేస్తున్నారు.

Saudi Arabia Women Jobs
Saudi Arabia Women Jobs: సౌదీ అరేబియాలో యువరాజు పాలన మొదలయ్యాక మహిళల విషయంలోఎన్నో మార్పులొచ్చాయి. మహిళలు స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు.సంప్రదాయం ‘ముసుగు’నుంచి బయటపడుతున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిపోయిన మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మహిళలు సాధికారిత దిశగా సౌదీ మహిళలు దూసుకుపోతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు మహిళలు ‘బుల్లెట్’ల్లా ట్రైన్స్ నడపటానికి పోటీ పడుతున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో మహిళలు ‘బుల్లెట్ ట్రైన్ పడటానికి జారీ అయిన నోటిఫికేషన్ లో 28వేలమంది దరఖాస్తు చేసుకున్నారు.
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షలల్లో చిక్కుకుపోయిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ తీసుకున్న నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న… మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది.
Also read : లక్ష్యానికి రెక్కలు : సౌదీ తొలి మహిళా రేసర్.. రీమా జుప్ఫాలీ
ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ ఆంక్షలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు సౌదీ మహిళలు అభ్యుదయ బాటలో నడుస్తున్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకునేదిశగా పయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.
సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే మహిళలు ఉద్యోగాలు చేయటానికి తమలో ఉన్న ప్రతిభను చాటుకోవటానికి ఎంతగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు జీతంతో కూడిన ట్రైనింగ్ ఇస్తారు.
Also read : సౌదీ అరేబియా సైన్యంలోకి మహిళలు..! ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!
తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. దశాబ్దాల కాలం ఆంక్షల్లో మగ్గిపోయిన మహిళలు ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు.
యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అంటే మహిళలు ఎంతగా సాధికారతను కోరుకుంటున్నారో సౌదీలో పెరుగుతున్న మహిళా ఉద్యోగల సంఖ్యకు సంబంధించి వెల్లడించే నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది.
Also read : Dont Marry Them : ఆ నాలుగు దేశాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు : సౌదీ అరేబియా ఆదేశం
సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్‌లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోనున్నాయి. అలాగే మరింతగా సౌదీ మహిళలు అభ్యుదయం వైపు దూసుకుపోవాలని ఆకాంక్షిద్దాం..