Dont Marry Them : ఆ నాలుగు దేశాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు : సౌదీ అరేబియా ఆదేశం

Dont Marry Them :  ఆ నాలుగు దేశాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు : సౌదీ అరేబియా ఆదేశం

Dont Marry The Women Of Those Four Countries

Dont Marry the women of those four countries : ‘‘పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌ దేశాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు’’..అంటూ సౌదీ అరేబియాపాలకులు ఆదేశాలు జారీ చేసిందని ఆ విషయాన్ని సాక్షాత్తు సౌదీ మీడియానే చెబుతోందని పాకిస్థాన్‌కి చెందిన డాన్ రిపోర్ట్ చేసింది. ఇది తీవ్ర కలకలం రేపుతోంది. అనధికారిక లెక్కల ప్రకారం…సౌదీ అరేబియాలో ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకూ విదేశీయులను వివాహం చేసుకోవటానికి సౌదీ అరేబియా పురుషులకు ఎటువంటి ఆంక్షలు లేవు. ఎటువంటి ఇబ్బందీ పడేవారు కాదు. ఇప్పుడు సౌదీ ప్రభుత్వం ఈ నాలుగు దేశాలకు చెందిన యువతుల్ని వివాహం చేసుకోవద్దనంటూ ప్రకటించిందనే విషయం సౌదీలోనే కాదు ఆయా దేశాల్లో కలకలం రేపుతోంది.

విదేశీయులను వివాహం చేసుకోవాలనుకునే..అంటే ప్రత్యేకించి సౌదీ పురుషులు ఇప్పుడు కఠినమైన నిబంధనలను ఎదుర్కొంటున్నారని మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్-ఖురాషిని ఉటంకిస్తూ మక్కా దినపత్రికలో ఒక నివేదిక పేర్కొంది. ఆదేశాలతో ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకుంటే…ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌ దేశాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే కఠిన నిబంధనలు అడ్డొస్తాయని మక్కా డైలీ రిపోర్ట్ చేసింది.

అసలీ కండీషన్ ఎందుకొచ్చిందనే అంశంపై కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియా ప్రజల్లో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని సౌదీ పాలకులు భావించినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే… కొన్ని అదనపు రూల్స్ పాటించాల్సి ఉంటుందని డాన్ పత్రిక నివేదించింది.

ఇప్పుడు విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలి అనుకునే సౌదీ అరేబియా పురుషులు… తప్పనిసరిగా ప్రభుత్వానికి మ్యారేజ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. ఎవరైనా విడాకులు తీసుకొని… మళ్లీ పెళ్లికి రెడీ అయితే… (వారు 6 నెలల దాకా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్-ఖురాషి తెలిపారని డాన్ నివేదించింది.

అలా పెళ్లి చేసుకుంటామని దరఖాస్తు పెట్టుకునేవారి కొన్ని రూల్స్ తప్పనిసరి అని డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్ ఖురేషీ చెప్పుకొచ్చారు. దరఖాస్తు పెట్టుకునేవారి వయస్సు 25 ఏళ్లు దాటి ఉండాలి. అప్లికేషన్‌పై ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం ఉండాల్సిందే. దరఖాస్తు దారుల ఐడీ కార్డులు, ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుందని తెలిపినట్లుగా ఖురేషి తెలిపారని డాన్ చెబుతోంది.

సౌదీ అరేబియాలో కొన్నేళ్లుగా లక్షలాదిమంది విదేశీయులు నివసిస్తున్నారు. వారితో స్థానికులకు మంచి పరిచయాలు కొనసాగుతున్నాయి. దీంతో పెళ్లి సంబంధాలూ కుదుర్చుకుంటున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా వివాహాలు కుదుర్చుకుని చేసుకుంటున్నారు.సంబంధాలు కలుపుకుంటున్నారు. కానీ సడెన్ గా ఇలా విదేశీయుల్ని వివాహం చేసుకోవటానికి వీల్లేదంటే..ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిమీద సౌదీలో చర్చగా మారినట్లుగా తెలుస్తోంది.

కానీ పరిస్థితులు ఎలా ఉన్నా..ఎటువంటి ఆదేశాలు జారీ అయినా సరే..సౌదీలో పాలకులకు ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఎవరైనా సరే జారీ చేసిన రూల్స్ పాటించాల్సిందే. అందుకే ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో సౌదీ అరేబియాకు మంచి సంబంధాలే ఉన్నప్పటికీ సౌదీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం… ఆ రెండు దేశాలకూ ఇబ్బంది కలిగించే అంశమనే చెప్పాలి. కాకపోతే మయన్మార్‌కి సౌదీ పాలకులతో పెద్దగా లేవనే చెప్పాలి. అందువల్ల ఆ దేశాలు ఈ రూల్‌ని పెద్దగా పట్టించుకునే అవకాశాలు ఉండొచ్చు..ఉండకపోవచ్చు..