Tablighi Jamaat : తబ్లిగీ జమాత్ పై సౌదీ అరేబియా నిషేధం

ఇస్లామిక్​ సంస్థ "తబ్లిగీ జమాత్"పై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ జమాత్ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి సౌదీ

Tablighi Jamaat : తబ్లిగీ జమాత్ పై సౌదీ అరేబియా నిషేధం

Saudi8

Tablighi Jamaat :  ఇస్లామిక్​ సంస్థ “తబ్లిగీ జమాత్”పై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ జమాత్ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి సౌదీ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. తబ్లిగీ జమాత్​తో సమాజానికి ముప్పు పొంచి ఉందని ప్రజలకు తెలియజేయాలని మసీదులు,ముస్లిం మత బోధకులను సౌదీ ప్రభుత్వం ఆదేశించింది. ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ అరేబియా ఇస్లామిక్​ వ్యవహారాల మంత్రి డా. అబ్దుల్​లతీఫ్​ అల్​ షేక్​ ఓ ప్రకటన విడుదల చేశారు.

94 ఏళ్ల క్రితం భారత్ లో మొదలై
స్వచ్ఛమైన” ఇస్లాం”కు ముస్లింలు తిరిగి రావాలనే ముఖ్య లక్ష్యంతో 1926లో మౌలానా మహ్మద్​ ఇలియాస్​.. తబ్లిగీ జమాత్ ఉద్యమాన్ని హర్యానాలోని నుహూలో​ ప్రారంభించారు. తబ్లిగీ జమాత్​ పని.. ముస్లింలను ప్రోత్సహించడం, సున్నీ ఇస్లాంను అనుసరించాలని ఇతరులకు ఉద్బోధ చేయడం. మొఘల్ చక్రవర్తుల కాలంలో చాలా మంది ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు తెలుస్తొంది. కానీ ఆ తర్వాత వారంతా మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించడం మొదలుపెట్టారు. బ్రిటీష్ పాలన కాలంలో ఆర్య సమాజం మతం మారిన వారిని శుద్ధీకరించి హిందువులుగా స్వీకరించడం ప్రారంభించింది. ఈ సమయంలోనే తమ మత ప్రాశస్త్యాన్ని కాపాడుకునేందుకు మౌలానా మహ్మద్​ ఇలియాస్ ఇస్లాం మత ప్రచారం మొదలుపెట్టారు. దీనిని మత సంస్కరణల ఉద్యమంగా వ్యాప్తి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో తబ్లిగీ జమాత్ శాఖలు ఉన్నాయి. తబ్లిగీ జమాత్ ముఖ్య కార్యాలయం ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35-30 కోట్ల మంది ముస్లింలు.. తబ్లిగీని అనుసరిస్తున్నట్లు సమాచారం. ఇండోనేసియా, మలేసియా, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, థాయిలాండ్​ వంటి దేశాల్లో తబ్లిగీలు కోట్లల్లో ఉన్నారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో ఏటా తబ్లిగీ జమాత్ భారీ ఎత్తున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటది. దేశ విదేశాలన నుంచి హాజరయ్యేందుకు వీలుగా కొన్ని నెలల ముందే వాటి షెడ్యూల్ ను ఖారారు చేస్తుంటారు.

అయితే తబ్లిగీ జమాత్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో దీనికి సంబంధాలున్నాయని 2011లో “వికిలీక్స్” సంచలన ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులకు డబ్బు,వీసాలు తబ్లిగీ ద్వారా అందుతున్నాయని పేర్కొంది. అయితే వీటిని జమాత్ ప్రతినిధులు ఖండించారు.

ఇక,గతేడాది మార్చిలో భారత్​లో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాతే ప్రధాన కారణమని కేంద్రం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు​ ఉన్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్​లో జరిగిన తబ్లిగీ జమాత్ మతపరమైన కార్యక్రమానికి వేలాదిగా హాజరయ్యారని పేర్కొంది. వీరిలో చాలా మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత దేశంలో కరోనా వేగంగా విస్తరించింది. దీంతో ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న 2500 మందికిపైగా విదేశీయులను భారత్​లో ప్రవేశించకుండా పదేళ్ల నిషేధం విధించింది భారత్.

ALSO READ Swarnim Vijay Parv : ఇండియా గేట్ వద్ద “స్వర్ణిమ్ విజయ్ పర్వ్” ప్రారంభించిన రాజ్‌నాథ్