Swarnim Vijay Parv : ఇండియా గేట్ వద్ద “స్వర్ణిమ్ విజయ్ పర్వ్” ప్రారంభించిన రాజ్‌నాథ్

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద "స్వర్ణిమ్ విజయ్ పర్వ్"ను ప్రారంభించారు. 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయం

Swarnim Vijay Parv :  ఇండియా గేట్ వద్ద “స్వర్ణిమ్ విజయ్ పర్వ్” ప్రారంభించిన రాజ్‌నాథ్

Rajnath

Swarnim Vijay Parv :  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద “స్వర్ణిమ్ విజయ్ పర్వ్”ను ప్రారంభించారు. 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయం, భారత్-బంగ్లాదేశ్ స్నేహం యొక్క 50 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

స్వర్ణిమ్ విజయ్ పర్వ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనరల్ రావత్‌ను గుర్తు చేసుకున్నారు రాజ్‌నాథ్ సింగ్. జనరల్ రావత్, అతని భార్య మరియు మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించినందున ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ని చాలా సాధారణంగా జరుపుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

1971 నాటి ఇండో బంగ్లాదేశ్ యుద్ధం గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య స్థాపనకు భారతదేశం దోహదపడింది, గత 50 ఏళ్లలో బంగ్లాదేశ్ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నందుకు ఈ రోజు మనం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజు నేను న భారత సాయుధ దళాలలోని ప్రతి సైనికుడి ధైర్యసాహసాలు, పరాక్రమం, త్యాగానికి తలవంచి నమస్కరిస్తున్నాను. వారి కారణంగా 1971 యుద్ధంలో భారతదేశం గెలిచింది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది”అని అన్నారు.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం…1971 యుద్ధంలో ఉపయోగించిన ప్రధాన ఆయుధాలు మరియు పరికరాలు, ప్రధాన యుద్ధాల స్నిప్పెట్‌లు స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా ఇండియా గేట్ వద్ద ప్రజల సందర్శనార్థం ప్రదర్శించబడతాయి. దివంగత CDS జనరల్ బిపిన్ రావత్ యొక్క చివరి సందేశం కూడా ఈ రోజు కార్యక్రమంలో ప్రసారం చేయబడుతుంది. డిసెంబర్-8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్‌తో పాటు మరో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 13న స్వర్ణిమ్ విజయ్ పర్వ్ ముగింపు వేడుకలు జరగనుండగా, దీనికి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు బంగ్లాదేశ్‌ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

ALSO READ Omicron Wave : జనవరి నుంచి బ్రిటన్ లో భారీగా ఒమిక్రాన్ కేసులు!