హ్యాట్సాఫ్.. స్కాట్‌లాండ్!..మ‌హిళ‌ల‌కు శానిట‌రీ ప్యాడ్స్ ఉచితం..!!

  • Published By: nagamani ,Published On : November 25, 2020 / 12:35 PM IST
హ్యాట్సాఫ్.. స్కాట్‌లాండ్!..మ‌హిళ‌ల‌కు శానిట‌రీ ప్యాడ్స్ ఉచితం..!!

scotland women will get sanitary pads for free : మ‌హిళ‌ల‌కు శానిట‌రీ ప్యాడ్లను ఉచితంగా ఇచ్చే దేశంగా స్కాట్లాండ్ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా నిలిచింది. పీరియడ్స్ ఉత్పత్తులను మహిళలకు పూర్తి ఉచితంగా పొందేందుకు చట్టపరమైన హక్కు కలిగేలా స్కాట్లాండ్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది.



ఈ బిల్లును లేబర్ హెల్త్ ప్రతినిథి మోనికా లెన్నాన్ స్కాటిష్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా..MSPsలు దీన్పని ఏకగ్రీవంగా ఆమోదించారు. మహిళల కోసం వారి ఆరోగ్యం కోసం..శానిటరీ పాడ్స్ ఉచితంగా అందించేందుకు ఇటువంటి చట్టాన్ని చేసిన దేశంగా స్కాట్లాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం కావటం గమనించాల్సిన విషయం.



ఈ సందర్భంగా..లెన్నాన్ మాట్లాడుతూ..పీరియడ్ ప్రొడక్ట్స్ ను ఉచితంగా అందించటం ప్రగతి శీల చట్టమని..ఇది కరోనా వైరస్ మహమ్మారిగా మారిన ఈ సమయంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకందని అన్నారు. పాండమిక్స్ సమయంలో అసవరమైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని ఇది చాలా మంచిదని అన్నారు.



మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందించటంకోసం ప్ర‌భుత్వం ఏటా 24.1 మిలియ‌న్ పౌండ్ల‌ను ఖ‌ర్చు చేయ‌నుంది. ఈ ప్యాడ్ల‌ను మ‌హిళ‌లు స్థానికంగా ఉన్న క‌మ్యూనిటీ సెంట‌ర్లు, యూత్ క్ల‌బ్‌లు, ఫార్మ‌సీల‌లో ఉచితంగా తీసుకోవ‌చ్చు.



కాగా రెండేళ్ల క్రితమే..2018లోనే స్కాట్‌లాండ్ లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో శానిట‌రీ ప్యాడ్ల‌ను ఉచితంగా అందివ్వ‌డం ప్రారంభించింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లంద‌రూ వాటిని ఉచితంగా తీసుకోనున్నారు. మ‌రోవైపు యూకేలో శానిట‌రీ ఉత్ప‌త్తుల‌పై 5 శాతం ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారు.



యురోపియ‌న్ యూనియ‌న్ రూల్స్ ప్ర‌భావం వ‌ల్ల వారు ఆ ట్యాక్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా విధించాల్సి వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ స్కాట్‌లాండ్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం నిజంగా అభినంద‌నీయ‌మ‌ని ప‌లువురు ప్రశంసిస్తున్నారు.