Ghost in House : ఇంట్లోనే తిరుగుతున్న ‘దెయ్యం’..సీసీటీవీలో చూసిన యజమాని

ఓ నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమెరాలో రికార్డు అయినీ ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు షాక్ అయ్యారు. వెంటనే మతాధికారి వద్దకు వెళ్లి ఆ దెయ్యం పీడ విరగడయ్యేలా ఏదన్నా చేయమని కోరారు.

Ghost in House : ఇంట్లోనే తిరుగుతున్న ‘దెయ్యం’..సీసీటీవీలో చూసిన యజమాని

Ghost In House

Ghost in House : దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్న ఈనాటిది కాదు. ఈ ప్రశ్నకు అంతేలేదు. ఇది నిరంతరం వచ్చే ప్రశ్న. దెయ్యాలు ఉన్నాయని కొంతమంది అంటే..మరికొందరు దెయ్యాలూ లేవు భూతాలు లేవని కొట్టి పారేస్తారు. ఇక ఏ డౌట్ వచ్చినా గూగుల్ లో వెతికేటయం మామూలైపోవటంతో దెయ్యాల గురించి గూగుల్ లో వెదికితే ఎన్నో వీడియో కనిపిస్తాయి. అదిగో అక్కడ కనిపిస్తోంది అదేమనుకున్నారు? దెయ్యం వారి పక్కనే నిలబడింది చూశారా? అంటూ ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీతో క్రియేట్ చేసినవే ఉంటాయి. అయితే..అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది వారి వారి నమ్మకాలపై ఉంటుంది.కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఓ సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డు అవ్వటం చూస్తే ‘వామ్మో అవి దెయ్యాలే అని కచ్చితంగా అంటారు.

స్కాట్‌ల్యాండ్‌లో ఓ నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు షాక్ అయ్యారు. వెంటనే మతాధికారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఆ దెయ్యం పీడ విరగడయ్యేలా ఏదన్నా చేయమని కోరారు. స్కాట్ లాండ్ లోని గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి హడలిపోయింది. తమ గార్డెన్‌లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం తిరుగుతూ కనిపించింది. నల్లగా ఉన్న ఈ నీడ ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లుగా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన వెంటనే తీవ్రంగా భయపడిపోయింది మాక్సిన్‌..తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదనీ..ఇది వరకూ కూడా ఇటువంటిది చూశాననీ కానీ దాన్ని అప్పట్ల అంతగా పట్టించుకోలదని దయచేసి నాకు ఈ పీడ వదిలేలా ఏదన్నా చేయమని కోరింది మతాధికారిని.

తన పిల్లలు గార్డెన్‌లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని..ఓ రోజు రాత్రి తన భర్త కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని..అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని చెప్పుకొచ్చింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగానని తెలిపింది. కానీ మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా భ్రమ అని కొంతమంది అంటుంటే..ఇటువంటి వాటిని లైట్ తీసుకోకూడదు..ఏదన్నా చేసి ఇటువంటి పీడ వదిలించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.