ట్విట్టర్ సీఈఓకు పార్లమెంటరీ కమిటీ షాక్!!

ట్విట్టర్ సీఈఓకు పార్లమెంటరీ కమిటీ షాక్!!

ప్రజలకు దగ్గరగా ఉంటూ సమాచారాన్ని ఎవరి నుంచి ఎక్కడికైనా పంపే మాద్యమం ట్విట్టర్. దానికే పార్లమెంటరీ ప్యానెల్ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ సీఈఓ పార్లమెంటరీ ప్యానెల్ ముందు 15 రోజుల్లోగా హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసింది. సోషల్‌ మీడియాలో పౌరహక్కుల పరిరక్షణ విషయమై వివాదాలు జరగడంతో వివరణ ఇవ్వమని ఆదేశించింది. సమాచార సాంకేతికతపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. 

ముందుగా హాజరుకావాలని నిర్దేశించిన తేదీలకు సీఈఓ, తదితర ప్రముఖులు గైర్హాజరీ అయ్యారు. సోమవారం కొందరు మాత్రమే హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వెళ్లారు. ట్విటర్‌ అంతర్జాతీయ విభాగం సీఈవో జాక్‌ డొర్సేతోపాటు ఉన్నతాధికారులు తమ ముందు హాజురు కావాల్సిందేనని, వారు హాజరయ్యేవరకు ఇతర ట్విటర్‌ అధికారులను తము కలువబోమని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్‌ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి మాత్రమే అనుకూలంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంచితే, సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా భద్రతపై  చెలరేగుతున్న ఆందోళనలు, రానున్న ఎన్నికలు నేపథ్యంలో ట్విటర్‌ డేటా భద్రతపై గ్లోబల్‌గా విచారణను జరిపేందుకు పూనుకుంది. ఈ కోవలో అమెరికా, సింగపూర్‌, ఈయూ తర్వాత, ఇండియా నాలుగోదేశంగా నిలిచింది.