Woman Dies In Gym : షాకింగ్.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటుతో యువతి మృతి, వీడియో వైరల్

Woman Dies In Gym : షాకింగ్.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటుతో యువతి మృతి, వీడియో వైరల్

Woman Dies In Gym : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా ఈక్వెడార్ లో ఓ జిమ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలింది. అంతా చూస్తుండగానే ఆ యువతి అలాగే ముందుకు పడిపోయింది. సహచరులు వెంటనే ఆమె దగ్గరికి వెళ్లారు. ఆమెను లేపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువతిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే వారు యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, గుండెపోటుతో ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Also Read..Bride Dies Of Cardiac Arrest : పెళ్లిలో తీవ్ర విషాదం.. దండలు మార్చుకుంటుండగా గుండెపోటుతో మండపంపైనే వధువు మృతి

మృతురాలిని డయానా రామిరెజ్ గా గుర్తించారు. ఆమె వయసు కేవలం 28 ఏళ్లే. ఈక్వెడార్ లోని జోనా మస్కులార్ జిమ్ లో ఈ ఘటన జరిగింది. వర్కౌట్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ల ముందే యువతి గుండెపోటుతో మరణించడం సహచరులను షాక్ కి గురి చేసింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆమె ప్రాణం పోయిందని వాపోయారు.

Also Read..Soaked Peanuts : రోజుకు గుప్పెడు నానబెట్టిన వేరుశెనగలు తింటే క్యాన్సర్, గుండె వ్యాధులు దరిచేరవు?

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా వంటి ప్రముఖులు సైతం గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఇలా పలువురు మరణించడం వారి అభిమానులను బాధకు గురిచేసింది.

Man Dies While Dancing : వీడియో.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

కాగా, ఇటీవలి కాలంలో అన్ని ఏజ్ గ్రూపుల్లో మరీ ముఖ్యంగా యువతలో గుండెపోటు కామన్ గా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జిమ్ లో గుండెపోటు..