మహిళ షూలో దూరిన కొండచిలువ : ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ ఫ్లైట్ లో

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 09:47 AM IST
మహిళ షూలో దూరిన కొండచిలువ : ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ ఫ్లైట్ లో

స్కాంట్లాండ్ : సమద్రాలు దాటి..దేశ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఎట్టకేలకు సురక్షితంగా హాయిగా మనం చేరాలనుకున్న గమ్యస్థానం చేరుకున్న తరువాత మనం చేసే మొదటి పని ఏంటి? మనం లగేజ్ చెక్ చేసుకుంటాం. హమ్మయ్య అంతా ఉంది అని రిలాక్స్ అవుతాం. పూర్తిగా రిలాక్స్ అవకుండానే..హఠాత్తుగా మీ బ్యాగ్ లో ఓ పాము ఉందని తెలిస్తే..అది మీరు వేసుకునే షూలో ఉంటే..ఎలా ఉంటుందీ మీ మెంటల్ టెన్షన్..షాక్ అవుతారు కదూ..అదిగో అదే జరిగింది. ఈ ఘటన ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 

ఓ మహిళ షూలో దూరిన పాము 10,15 కాదు  ఏకంగా 15 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. విహార యాత్ర కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మెయిరా బోక్సల్ అనే మహిళ తిరిగి స్కాంట్లాండ్ విమానంలో చేరుకుంది. 15 వేల కిలోమీటర్ల (9 వేల మైళ్లు) ప్రయాణం తరువాత తన గమ్యస్థానానికి చేరుకున్న ఆమె తన లగేజీని సర్దుకుని షూ వేసుకుంటుండగా కాలికి ఏదో మెత్తగా తగిలింది. ఏమిటాని  కాలును తీసి షూని చెక్ చేసుకుంది. ఇంకేముంది చుట్టచుట్టుకుని పడుకున్న పాము కనిపించింది. 
 

తనను ఆట పట్టించటానికి ఎవరన్నా బొమ్మ పామును పెట్టారేమో అనుకుంది. కానీ అది కదిలేసరికి దిమ్మ తిరిగిపోయింది. ఆమెతో పాటు అక్కడున్నవారందు భయాందోళనలకు గురయ్యారు. దీంతో అధికారులకు సమాచారం అందించడంతో దానిని పట్టుకున్నారు. ఆ పాము విషపూరితం కాదని, కొండచిలువ జాతికి చెందినదని చెప్పారు. మకాయ్ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించింది ఈ చిన్నపాటి కొండచిలువ.