Covid Vaccination: వ్యాక్సిన్ వేయించుకుంటే వారం రోజుల పాటు వీటికి దూరంగా ఉండాలి

వ్యాక్సినేషన్ తీసుకున్న వారు వారం రోజుల పాటు ఎక్సర్‌సైజ్ చేయడం మానేయాలని సింగపూర్ ఆరోగ్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం.. యువకులు, 30ఏళ్ల లోపు వారికి నిబంధనలు విధించినట్లు సమాచారం.

Covid Vaccination: వ్యాక్సిన్ వేయించుకుంటే వారం రోజుల పాటు వీటికి దూరంగా ఉండాలి

Covid Vaccination

Covid Vaccination: వ్యాక్సినేషన్ తీసుకున్న వారు వారం రోజుల పాటు ఎక్సర్‌సైజ్ చేయడం మానేయాలని సింగపూర్ ఆరోగ్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం.. యువకులు, 30ఏళ్ల లోపు వారికి నిబంధనలు విధించినట్లు సమాచారం.

16 సంవత్సరాల టీనేజర్.. వ్యాక్సిన్ తీసుకుని జిమ్ లో వెయిట్ ఎత్తుతుండగా కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు వ్యాక్సిన్ తీసుకోవడం కారణమై ఉండొచ్చని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకోవడానికి 12 నుంచి 24గంటల సమయం ముందు కూడా ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు.

జూన్ 27న ఫైజర్-బయోఎన్టెక్ ఫస్ట్ డోస్ తీసుకున్న వ్యక్తి జులై 3న ఎక్కువ బరువులు ఎత్తుతూ.. చనిపోయినట్లు బ్లూమ్బెర్గ్ మీడియా చెప్పింది. ప్రాథమిక విచారణలో అతనికి కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు తెలిసింది. క్లినికల్, ల్యాబొరేటరీ టెస్టుల్లో నిజాలు తెలుస్తాయని హెల్త్ మినిస్ట్రీ స్టేట్మెంట్లో పేర్కొంది.

రిస్క్ లు ఉన్నాయని వ్యాక్సినేషన్ కు దూరంగా ఉండొద్దని సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. దాంతో పాటు ఇజ్రాయెల్, అమెరికాలోనూ కొందరికి గుండె జబ్బులు వచ్చినట్లు తెలిసింది. ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.

వ్యాక్సిన్ కారణంగా కార్డియాక్ అరెస్ట్ అవుతుందని కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ.. కచ్చితంగా ఓ వారం పాటు ఎక్సర్‌సైజ్ చేయడం, బరువులు ఎత్తడం లాంటివి చేయొద్దని సింగపూర్ ప్రభుత్వం సూచిస్తుంది.