కిడ్నాపర్ల నుంచి బాలికను రక్షించిన Snapchat 

  • Published By: sreehari ,Published On : January 21, 2020 / 11:18 AM IST
కిడ్నాపర్ల నుంచి బాలికను రక్షించిన Snapchat 

టెక్నాలజీ మరింత డెవలప్ అయింది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాలామందిని ఇదే టెక్నాలజీ కాపాడుతోంది. ఆపిల్ ఐఫోన్ వంటి హ్యాండసెట్లలో కూడా SOS వంటి టెక్నాలజీ సాయంతో ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని గుర్తించిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఫొటో షేరింగ్ యాప్.. SnapChat యాప్.. 14ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడింది. కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారిని రక్షించింది. కాలిఫోర్నియాలో ముగ్గురు కిడ్నాపర్లు బాలికను కిడ్నాప్ చేశారు. 

అదే సమయంలో ఆ చిన్నారి తన స్నాప్ చాట్ అకౌంట్ ద్వారా స్నేహితులకు సమాచారం అందించింది. తనను కిడ్నాప్ చేశారని, ప్రమాదంలో ఉన్నానంటూ మెసేజ్ ఫార్వాడ్ చేసింది. తాను ఎక్కడ ఉన్నానో తనకు తెలియదని తెలిపింది. వెంటనే ఆమె స్నేహితులు కిడ్నాప్ అయిన బాలిక లొకేషన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

లొకేషన్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్లు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి బాలికను రక్షించారు. బాలికతో పాటు ఉన్న వ్యక్తుల్లో 55 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు బాలికను బలవంతంగా కార్లోకి ఎక్కించుకుని వెళ్లి మోటాల్ రూపంలో లైంగికంగా వేధించినట్టు నివేదిక తెలిపింది. ఎప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం వాడే స్నాప్ చాట్.. తొలిసారి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించేందుకు సాయపడిందని స్నాప్ చాట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.