అమ్మకు ఆపద : అంబులెన్స్ కంటే ముందే వచ్చేశాడు

అమ్మకోసం ఓ కుమారుడు పడిన తపన..ఆరాటానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది ఓ ఆసక్తికర ఘటనగా పేర్కొంటున్నారు. కన్న తల్లి గాయపడిందని తెలుసుకున్న కుమారుడు..320 కిలోమీటర్ల దూరం ఏక బిగిన ప్రమాణం చేసి అంబులెన్స్ కంటే ముందే అమ్మ దగ్గరకు చేరుకున్న ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.

  • Edited By: veegamteam , February 7, 2019 / 06:10 AM IST
అమ్మకు ఆపద : అంబులెన్స్ కంటే  ముందే వచ్చేశాడు

అమ్మకోసం ఓ కుమారుడు పడిన తపన..ఆరాటానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది ఓ ఆసక్తికర ఘటనగా పేర్కొంటున్నారు. కన్న తల్లి గాయపడిందని తెలుసుకున్న కుమారుడు..320 కిలోమీటర్ల దూరం ఏక బిగిన ప్రమాణం చేసి అంబులెన్స్ కంటే ముందే అమ్మ దగ్గరకు చేరుకున్న ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.

డెవోన్ : అమ్మకోసం ఓ కుమారుడు పడిన తపన..ఆరాటానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది ఓ ఆసక్తికర ఘటనగా పేర్కొంటున్నారు. కన్న తల్లి గాయపడిందని తెలుసుకున్న కుమారుడు..320 కిలోమీటర్ల దూరం ఏక బిగిన ప్రమాణం చేసి అంబులెన్స్ కంటే ముందే అమ్మ దగ్గరకు చేరుకున్న ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ప్రయాణంలో ఆ కుమారుడు పడిన తపన..అమ్మ కోసం పడిన శ్రమ వర్ణించలేనిది. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది. 
 

మార్క్ క్లెమెంట్స్ అనే వ్యక్తి తల్లికి తలకు గాయమైందనీ..ఎముక విరిగిందని కుమారుడికి ఫోన్ చేసి తెలిపింది. అంతే డెవోన్ లో నివసించే తల్లి దగ్గరకు అక్కడకు 320 కిలో మీటర్ల దూరంలో నివసించే మార్క్ కు తెలియటంతో ఆఘమేఘాల మీద వచ్చేసి తల్లి దగ్గర వాలిపోయాడు. ఈ ప్రయాణంలో భాగంగా మార్క్ ఓ బస్ ఎక్కాడు..తరువాత రెండు రైళ్లు మారి లండన్ చేరుకున్నాడు. తరువాత మరో వాహనంలో డెవోన్ లోని తన తల్లి ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇక్కడ మరో విశేషం ఏమిటంటే 320 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాడు కానీ..అక్కడకు కేవలం 10 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో ఉన్న అంబులెన్స్ మాత్రం రాలేదు.  తను తల్లి వద్దకు వచ్చిన వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసినా..ఏడు గంటల తరువాత తనకు మెడికల్ హెల్ప్ అందిందని మార్క్ తల్లి మార్గరెట్ (77) ఆరోపించారు. తాను వచ్చేసరికి తల్లి నేలపై పడిపోయి..కదల్లేని స్థితిలో దీనావస్థలో కనిపించిందని..ఇంత ఘోరమైన పరిస్థితిలో అంబులెన్స్ వ్యవస్థ ఉందని మార్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనను బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. జరిగిన తప్పుకు తాము క్షమాపణలు చెబుతున్నామని సౌత్ వెస్ట్రన్ అంబులెన్స్ సర్వీసెస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం మార్క్ క్లెమెంట్ తల్లికి శస్త్రచికిత్స జరుగగా, ఆమె కోలుకుంటున్నారని సదరు అధికారి తెలిపారు.