Omicron : ఒమిక్రాన్‌ గురించి ప్రపంచానికి తెలియజేసిన మమ్మల్ని ప్రశంసించకుండా విలన్లలా ఎందుకు చూస్తున్నారు?..దక్షిణాఫ్రికా

తమ దేశపు విమానాలపై నిషేధం విధించటంపై దక్షిణాఫ్రికా మండిపడింది.ఒమిక్రాన్‌ గురించి ప్రపంచానికి తెలియజేసిన మమ్మల్ని ప్రశంసించకుండా విలన్లలా ఎందుకు చూస్తున్నారు?..అంటూ ప్రశ్నిస్తోంది.

Omicron : ఒమిక్రాన్‌ గురించి ప్రపంచానికి తెలియజేసిన మమ్మల్ని ప్రశంసించకుండా విలన్లలా ఎందుకు చూస్తున్నారు?..దక్షిణాఫ్రికా

South Africa Fires On World Countries For Flight Ban (1)

South Africa Fires on World Countries for flight ban : కోవిడ్-19 చైనా నుంచే ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే ఆరోపణలున్నాయి. వాటిని ఇప్పటికీ ఖండిస్తునే ఉంది. ఈక్రమంలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’దక్షిణాఫ్రికానుంచే ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోందనే ఆరోపణలపై దక్షిణాఫ్రికి మండిపడుతోంది. ‘‘ ‘ఒమిక్రాన్’ గుర్తించి ప్రపంచ దేశాలకు చెప్పిన మమ్మల్ని ప్రశంసించకుండా ఎందుకు మమ్మల్ని విలన్లలాగా చూస్తున్నారు? మా దేశం నుంచి వచ్చే విమానాలపై ఎందుకు నిషేధం విధిస్తున్నారు?’ అంటూ వివిధ దేశాలపై దక్షిణాప్రికా దేశం మండిపడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇలా నిషేధం విధించడాన్ని సౌతాఫ్రికా తీవ్రంగా తప్పుబట్టింది. తమను విలన్లలా చూడడం మానుకోవాలని ప్రపంచ దేశాలకు హితవు పలికింది.

Read more : Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ని మొద‌ట‌గా గుర్తించి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా?

పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించటంపై దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ (సామా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సామా చైర్ పర్సన్ ఆంగెలిక్యూ కొయెట్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తు..మా దేశాలనుంచి వచ్చే విమాన సర్వీసులపై నిషేధం విధించటం అనాలోచితమని అన్నారు. ఇటువంటి విధానాలను విడిచిపెట్టాలని వివిధ దేశాలను ఆమె కోరారు. ఒమిక్రాన్ నుంచి ఎటువంటి ముప్పు ఉంటుందన్న దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన సమాచారం ఏదీ లేదనితెలిపారు.

ఐ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ పై తగినంత సమాచారం లేకుండానే 18 దేశాలు మా విమాన సర్వీసులపై నిషేధం విధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి వేరియంట్ గురించి ప్రపంచానికి తెలియజెప్పినందుకు తమను ప్రశంసించాల్సింది పోయి తమ విమానాలను నిషేధించడం ఎంత మాత్రమూ సరికాదని ఆమె అన్నారు.

Read more : Omicron Mumbai : సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

మా దేశంపు శాస్త్రవేత్తలు కొత్తగా బాధితుల్లో వచ్చిన లక్షణాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండి..విస్తృతంగా జన్యుక్రమ పరిశీలన జరపడం వల్లే ఈ వేరియంట్ వెలుగు చూసిందని..లేదంటే ఐరోపా దేశాలు ఒమిక్రాన్‌ను గుర్తించి ఉండకపోవచ్చని అన్నారు. నిజానికి ఏ దేశమైనా తమ ప్రజలను కాపాడుకోవాలంటే వారిని అప్రమత్తం చేయాలని..ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తప్ప ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం సరికాదని సామా సామా చైర్ పర్సన్ ఆంగెలిక్యూ కొయెట్జీ సూచించారు.

కాగా..దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను చాలా ఆందోళనకర రకంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పలు దేశాలు అప్రమత్తమైయ్యాయి. దీంతో దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇలా నిషేధం విధించడాన్ని సౌతాఫ్రికా తీవ్రంగా తప్పుబట్టింది. తమను విలన్లలా చూడడం మానుకోవాలని..ఒమిక్రాన్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసినందుకు ప్రశంసించకపోయినా ఫరవాలేదు..కానీ ఇటువంటి నిర్ణయలు తగవు అని ఆమె హితవు పలికారు.

Read more : Omicron First Pic : కొత్త కరోనా ‘ఒమిక్రాన్‌’ తొలి చిత్రాలు..

కాగా ఒమిక్రాన్ ను కనుగొనటంలో సామా చైర్ పర్సన్ ఆంగెలిక్యూ కొయెట్జీ తీవ్ర కృషి చేశారు. దాన్ని మొదటి ఆమే కనుగొన్నారు. దీనిపై పలు పరీక్షలు చేసి ఎట్టకేలకు ఇది కొత్త వేరియంట్ అని నిర్ధారించుకుని ఈ కొత్త వేరియంట్ గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు న‌వంబ‌ర్ 25న ప్ర‌పంచానికి తెలియ‌జేశారు.