South Korea: దక్షిణ కొరియా తొక్కిసలాటలో 149కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 150 మందికి గాయాలు

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. ఈ ఘటనలో మరో 150 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడ్డ వారిలో 15 మంది విదేశీయులని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్‌ వేడుకల్లో భాగంగా ఇటావోన్ లో నిన్న ఓ ఇరుకైన వీధిలోకి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొని తొక్కిసలాట చోటుచేసుకుంది. చాలా మందికి గుండెపోటు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

South Korea: దక్షిణ కొరియా తొక్కిసలాటలో 149కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 150 మందికి గాయాలు

South Korea: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. ఈ ఘటనలో మరో 150 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడ్డ వారిలో 15 మంది విదేశీయులని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్‌ వేడుకల్లో భాగంగా ఇటావోన్ లో నిన్న ఓ ఇరుకైన వీధిలోకి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొని తొక్కిసలాట చోటుచేసుకుంది. చాలా మందికి గుండెపోటు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడకు చేరుకుని గాయపడ్డవారి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించారు. గాయపడ్డవారిలో చాలా మందికి ఊపిరి ఆడలేదు. హాలోవీన్‌ వేడుక జరుగుతుండడంతో పాటు ఇటావోన్ లోని ఓ బార్‌కు ఓ సెలెబ్రిటీ రావడంతో ఆ వీధిలోకి ఒక్కసారిగా జనాలు పరుగులు తీస్తూ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కొందరు కిందపడిపోయి తొక్కిసలాట చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలో ఇటీవలే కరోనా ఆంక్షలు సడలించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు హాలోవీన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు దాదాపు లక్ష మంది ప్రజలు హాజరయ్యారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..