Chinese Debt: చైనా నుంచి అప్పులు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక, పాక్, మాల్దీవ్స్

చైనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి.

Chinese Debt: చైనా నుంచి అప్పులు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక, పాక్, మాల్దీవ్స్

Chinese Debt: అవసరానికి చైనా నుంచి అప్పులు తీసుకున్న అనేక దేశాలు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. చైనాకు భారీగా బాకీ పడ్డాయి. వాటిలో శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్ ముందున్నాయి. చైనాకు పాకిస్తాన్ 77.3 బిలియన్ డాలర్లు రుణపడి ఉంది.

Girls at Ranchi School: మాతో ఫ్రెండ్షిప్ చేయండి.. లేదంటే కిడ్నాప్ చేస్తాం.. స్కూల్లో అమ్మాయిలను బెదిరించిన పోకిరీలు

మాల్దీవ్స్ తమ సంవత్సర స్థూల ఆదాయంలో 31 శాతం చైనాకు రుణపడి ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.44 వేల కోట్లకుపైగా చైనాకు చెల్లించాలి. ఇది 2020 నాటికి మాత్రమే. ప్రపంచ బ్యాంకు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఫోర్బ్స్ సంస్థ తాజాగా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2020 నాటికి ప్రపంచంలోని దాదాపు 97 దేశాలకు చైనా రుణాలిచ్చింది. ప్రపంచంలోని తక్కువ ఆదాయం కలిగిన దేశాలన్నీ దాదాపు చైనా నుంచి రుణం తీసుకున్నవే. ఆసియాతోపాటు, ఆఫ్రికా దేశాలకే ఎక్కువగా రుణాలిస్తోంది. ఈ దేశాలు 37 శాతం రుణాలు చైనా నుంచి తీసుకున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలు, మార్గాల ద్వారా తీసుకున్న రుణాలు 24 శాతం మాత్రమే. అంటే ప్రపంచం మొత్తం నుంచి తీసుకున్న రుణాలకంటే చైనా నుంచి తీసుకున్నవే ఎక్కువ.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

పోర్టుల నిర్మాణం, రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి, ఇతర నిర్మాణ రంగానికి సంబంధించే ఎక్కువగా చైనా రుణాలిస్తోంది. చైనాకు రుణపడి ఉన్న దేశాలకు సంబంధించి పాకిస్తాన్ 77.3 బిలియన్ డాలర్లు, అంగోలా 36.3 బిలియన్ డాలర్లు, ఇథియోపియా 7.9 బిలియన్ డాలర్లు, కెన్యా 7.4 బిలియన్ డాలర్లు, శ్రీలంక 6.8 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అనేక దేశాలు తమ స్థూల ఆదాయంలో 30-40 శాతం వరకు చైనాకు రుణపడి ఉన్నాయి. రుణాలిచ్చే విషయంలో చైనా అనుసరించే తీరుపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, పేద దేశాలపై రుణాల విషయంలో ఒత్తిడి తెస్తోందని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది.