Corona cases rise in China: చైనాలో కోవిడ్ హాట్ స్పాట్ గా గ్జియాన్ నగరం: 1.30 కోట్ల మంది లాక్ డౌన్ లోకి

కరోనా వైరస్ పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనా దేశంలో దాదాపు 21 నెలల అనంతరం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Corona cases rise in China: చైనాలో కోవిడ్ హాట్ స్పాట్ గా గ్జియాన్ నగరం: 1.30 కోట్ల మంది లాక్ డౌన్ లోకి

China

Corona cases rise in China: కరోనా వైరస్ పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనా దేశంలో దాదాపు 21 నెలల అనంతరం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని శాంగ్జి ప్రావిన్స్ లో ఉన్న గ్జియాన్ నగరంలో ఉన్నట్టుండి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గ్జియాన్ నగరంలో ఆదివారం ఒక్కరోజే 206 కొత్త కరోనా కేసులు నమోదుకాగా వాటిలో 155 కేసులు స్థానికంగా సంక్రమించినట్లుగా అధికారులు నిర్ధారించారు. దీంతో కోటి ముప్పై లక్షలు జనాభా కలిగిన ఈ నగరంలో కఠిన లాక్ డౌన్ అమలుచేస్తూ ప్రజలకు ఆదేశాలు జారీ చేసారు అక్కడి అధికారులు. గ్జియాన్ నగరాన్ని కోవిడ్ హాట్ స్పాట్ గా గుర్తించిన అధికారులు, అనుమానితులకు కరోనా పరీక్షలు జరుపుతున్నారు.

తాజాగా గ్జియాన్ నగరంలో నిర్ధారణ అయిన కేసుల్లో ఓమిక్రాన్ లక్షణాలు బయటపడలేదని పేర్కొన్న చైనా అధికారులు, క్రిస్టమస్ కు ముందు విదేశాల నుంచి దక్షిణ చైనాకు చేరుకున్న కొందరిలో ఓమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా నమోదు అవుతున్న కరోనా కేసులతో పోలిస్తే చైనాలో నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్యా తక్కువగానే ఉన్నప్పటికీ, “జీరో కోవిడ్ పాలసీ”దిశగా ముందుకు వెళ్తున్న ఆదేశంలో ఉన్నట్టుండి కేసులు పెరగడం పెద్ద విఘాతంగా భావిస్తున్నారు అక్కడి అధికారులు. కరోనా వ్యాప్తి నియంత్రణ కొరకు గ్జియాన్ నగరంలో వేలాది మంది వైద్య సిబ్బందిని మోహరింపజేసిన చైనా ప్రభుత్వం, కరోనా నియంత్రణ కొరకు కఠిన చర్యలు తీసుకుంది.

Also Read: Rahul On Booster Dose : దేశంలో బూస్టర్ డోస్..తాను చెప్పినట్లే కేంద్రం చేసిందన్న రాహుల్

ఇదిలాఉంటే.. 2022 ఫిబ్రవరి నెలలో చైనాలోని బీజింగ్ నగరంలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించనున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆటల నిర్వహణకు ఆటంకంగా మారుతుందని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకుంటే వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యపడకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ చైనా, దక్షిణ చైనా ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి అధికంగా ఉండగా, తూర్పు ఈశాన్య చైనాలో అతి తక్కువ కరోనా కేసులు బయట పడ్డాయి.

Also read: Modi to Interact with students: విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ