Modi to Interact with students: విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ

డిసెంబర్ 26న "మన్ కీ బాత్" కార్యక్రమం ద్వారా పలు విషయాలపై ప్రసంగించిన ప్రధాని మోదీ, తన తదుపరి కార్యక్రమం "పరీక్ష పర్ చర్చ" కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభమౌతుందని తెలిపారు.

Modi to Interact with students: విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ

Modi

Modi to Interact with students: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో మమేకమయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలతో పలు అంశాలపై చర్చిస్తారనే విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగానే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలను, అభిప్రాయాలను ప్రధాని మోదీ పంచుకుంటారు. ఇక సమయం సందర్భాన్ని బట్టి ఇతర సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ఆయా వర్గాలవారికి సూచనలు సలహాలు చేస్తుంటారు. కాగా డిసెంబర్ 26న “మన్ కీ బాత్” కార్యక్రమం ద్వారా పలు విషయాలపై ప్రసంగించిన ప్రధాని మోదీ, తన తదుపరి కార్యక్రమం “పరీక్ష పర్ చర్చ” కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభమౌతుందని తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 20 మధ్య జరగనున్న ఈకార్యక్రమంలో ఈ ఏడాది 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులతో ప్రధాని ముచ్చటించనున్నారు.

ఆదివారం ప్రధాని మోదీ “మన్ కీ బాత్” సందర్భంగా తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులతో ముచ్చటించేందుకు ఎంతో ఉత్సాహం కనుబరుస్తానని, వారిలోనే నైపుణ్య, తెలివితేటలను తెలుసుకోవడం ఎంతో నచ్చుతుందని మోదీ వ్యాఖ్యానించారు. రానున్న పరీక్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులతో మరిన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్న ప్రధాని మోదీ, కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందించనున్నట్లు తెలిపారు. పరీక్షలు, విజయాలు, జీవిత లక్ష్యాలపై జరిగే ఈకార్యక్రమంలో విద్యార్థులు ఎంతో చురుకుగా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు.

Also Read: Upcoming EV Cars in India: 2022 నుంచి ఊపందుకోనున్న ఎలక్ట్రిక్ వాహనాల జోరు: భారత్ లో ఇవే టాప్ ఎలక్ట్రిక్ కార్స్

ఇక ప్రధాని నరేంద్ర మోదీతో ఈ “పరీక్ష పర్ చర్చ” కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్షా పే చర్చా కోసం నమోదు చేసుకోవడానికి,
1. ముందుగా MyGov (www.mygov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. ఇక్కడ, పరీక్షా పే చర్చ 2021 బటన్‌పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు ‘పార్టిసిపేట్ నౌ’ బటన్‌ను నొక్కండి.

4. మీరు పాల్గొనడానికి తప్పనిసరిగా లాగిన్ అయి ఉండాలి. దీని కోసం, మీరు మీ ఈ-మెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

5. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ కోసం ఇచ్చిన ఏదైనా థీమ్‌పై మీ ఎంట్రీని పంపవచ్చు. మీరు ప్రధాని మోదీకి 500 పదాలలో ప్రశ్న పంపవచ్చు

Also read: Car updates in India: మారుతీ సుజుకి నుంచి త్వరలో రానున్న కొత్త కార్లు