Kabul Airport : కాబుల్ బాంబుదాడి నిందితుడు ఐదేళ్ల క్రితమే భారత్ లో అరెస్ట్ అయ్యాడు

అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగిన విదితమే.. అయితే ఈ దాడికి పాల్పడిన నిందితుడిని భారత్ ఐదేళ్ల క్రితమే అరెస్ట్ చేసింది.

Kabul Airport : కాబుల్ బాంబుదాడి నిందితుడు ఐదేళ్ల క్రితమే భారత్ లో అరెస్ట్ అయ్యాడు

Kabul Airport

Kabul Airport : అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగిన విదితమే.. ఈ ఘటనలో సుమారు 20 మంది అమెరికా సైనికులు మృతి చెందగా 100 మందికిపైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాదిని ఐదేళ్ల క్రితమే భారత్ అరెస్ట్ చేసింది. కొంతకాలం తర్వాత అతడిని తిరిగి అఫ్ఘాన్ లో విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనికులకు అప్పగించింది. ఈ విషయాన్ని ఐసిస్‌ భావజాల పత్రిక ‘స్వాత్‌ ఏ హింద్‌’ వెల్లడించింది. ఈ దాడికి గల కారణాలను కూడా ఈ పత్రిక బయటపెట్టింది. అఫ్ఘాన్ అధికారులు దేశం విడిచి వెళ్ళిపోతున్నందునే ఈ దాడి ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు పేర్కొంది.

Read More : MK Stalin: సీఎం స్టాలిన్‌ను కలిసిన చిన జీయర్‌స్వామి, మై హోం రామేశ్వరరావు

కాగా కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి పేరు అబ్దుర్‌ రెహ్మాన్‌ అల్‌ లోగ్రిగా ఈ పత్రిక పేర్కొంది. 2017లో అతడు ఢిల్లీలో ఆత్మహుతి దాడి చేయడానికి వచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అతడిని అరెస్ట్ చేసి విచారించి కొద్దీ రోజుల తర్వాత అఫ్ఘాన్ ప్రభుత్వానికి అప్పగించారు. అయితే అబ్దుర్‌ రెహ్మాన్‌ అల్‌ లోగ్రిగా అఫ్ఘాన్ కి చెందిన సంపన్న వ్యాపారి కుమారుడు. ఉగ్రవాదంవైపు ఆకర్షితుడై శిక్షణ తీసుకోని.. 2017 భారత్ వచ్చాడు. ఉగ్రకుట్రను అధికారులు భగ్నం చేశారు. అబ్దుర్‌ రెహ్మాన్‌ అల్‌ లోగ్రిని అఫ్ఘాన్ లోని అమెరికా దళాలు ఇంటరాగేషన్‌ చేశాయి. వారికి చాలా కీలకమైన సమాచారం లభించింది. దీంతో ఆ తర్వాత పలు ఆపరేషన్లకు ఆ సమాచారం ఉపయోగపడింది.

Read More : Afghan Crisis : అఫ్ఘాన్‌లో మహిళా మంత్రిత్వశాఖ పేరు మార్చేసిన తాలిబన్లు! ఏం పెట్టారంటే

పాకిస్తాన్ లో ఉగ్రశిక్షణ తీసుకున్న లోగ్రి.. మరో 12 మంది ఐసిస్ ఉగ్రవాదులతో కలిసి 2017లో ఢిల్లీలో బాంబు దాడికి ప్రణాళిక సిద్ధం చేశారు. లోగ్రి అరెస్ట్ తో 12 మంది ఉగ్రవాదుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. భారత్ లో బాంబు దాడికి 50 వేల డాలర్ల నిధులు సేకరించినట్లు భారత ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. అవి దుబాయ్ నుంచి వచ్చినట్లు తేల్చారు.