ట్యాక్సీ డ్రైవర్ భలే ఆఫర్..పాట పాడితే చాలు డబ్బులివ్వక్కర్లా..ఎదురు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తాడు..మరి ఎక్కేస్తారా?

ట్యాక్సీ డ్రైవర్ భలే ఆఫర్..పాట పాడితే చాలు డబ్బులివ్వక్కర్లా..ఎదురు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తాడు..మరి ఎక్కేస్తారా?

Taiwan taxi driver  Super Offer : ట్యాక్సీ డబ్బులివ్వాలి కదా..కానీ ట్యాక్సీ డ్రైవర్ ప్రకటించిన ఆఫర్ చూస్తే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అతని ట్యాక్సీ ఎక్కితే డబ్బులివ్వక్కర్లేదు. ఫ్రీ రైడ్..! కానీ ఓ కండిషన్..అతని ట్యాక్సీ ఎక్కితే ఓ పాట పాడాలి..అలా అతని వాయించే మ్యూజిక్ కు తగినట్లుగా పాట పాడితే..అది అతనికి నచ్చితే ఫ్రీ రైడ్ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు పాట పాడి మెప్పించిన సరదు ప్యాసింజర్ కు ఆ డ్రైవర్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తాడు..ఏంటీ మరి ఎక్కేస్తారా? ఆ ట్యాక్సీ..పాడేస్తారా ఓ మాంచీ పాట..మరి మ్యూజిక్ లవ్వర్ అయిన్ ఆ ట్యాక్సీ డ్రైవర్ గురించి ఆ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకుందామా? ఎందుకంటే మనం కూడా క్యాష్ ప్రైజ్ పొందొచ్చేమో..మరి ఇంకెందుకు ఆలస్యం..పోదాం పదండీ..

తైవాన్​​లో ట్యాక్సీ డ్రైవర్ ‘తు​ చింగ్ లియాంగ్’. ఎప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండటమంటే చింగ్ లియాంగ్ కు చాలా చాలా ఇష్టం..అంతకంటే మ్యూజిక్ అన్నా పాటలన్నా ఇంకా ఇష్టం. అందుకోసం తన ట్యాక్సీ ఎక్కే ప్యాసింజర్లకు ఓ ఆఫర్ ప్రకటించాడు. ఆ ఆఫర్ గురించి చెప్పేముందు చింగ్ చెప్పే ఓ మాట గురించి తెలుసుకోవాలి..

అన్నీ ఉన్నా చాలామంది ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు. కానీ చింగ్ మాత్రం “నా కన్నా అదృష్టవంతుడు ఎవరు ఉంటారు. ప్రతీరోజు పనికి వెళతా. కానీ నా ట్యాక్సీ ఎక్కేవారి నుంచి డబ్బు సంపాదించను” సంతోషాన్ని సంపాదిస్తా’’ నంటూ ఫుల్ హ్యాపీతో అంటుంటాడు. ఈ హ్యాపీ యంగ్ మ్యాన్..హ్యీపీగా ఉండేవాళ్లు యంగ్ మ్యాన్ లే మరి..అందుకే ఈ 57 ఏళ్ల చింగ్ ఎప్పుడూ యంగే..

తైవాన్ ప్రజలకు సంగీతమంటే మక్కువ ఎక్కువనే సంగతి తెలిసిందే. అలాగే చింగ్ కు కూడా.. అందుకే చింగ్ తన ట్యాక్సీలో ఎనిమిదేళ్లుగా ప్రయాణిస్తున్న వారికి ఫ్రీ రైడ్​తో పాటు గిఫ్టులు కూడా ఇస్తున్నాడు. కానీ షరతులు లేకపోతే మజా ఉండదు కదా..అందుకే చింగ్ ఈ ఆఫర్ కోసం ఓ షరతు పెట్టాడు. తనతోపాటు కరవోకే ( సంగీతానికి తగ్గట్టు పాడడడం) కండిషన్ పెట్టాడు.

ఈ ట్యాక్సీ ఎక్కే ప్యాసింజర్లు ఫ్రీ ట్రిప్​లో పాటు తన సంగీతానికి తగినట్లుగా పాటలు పాడాలి. అలా పాడేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని కండిషన్ పెట్టాడు చింగ్. సాధారణంగా సంగీత ప్రియులైన తైవానీయులు ఫ్రీ ట్రిప్ పొందటానికి అతని ట్యాక్సీ ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాదు అతని మ్యూజిక్ వినటానికి కూడా కారు ఎక్కుతారు. అతనితో కలిసి పాటలు పాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

అక్కడి లోకల్ ట్యాక్సీ యాప్​లో కరవోకే ఆప్షన్​తో పాటు ఇంగ్లిష్ మాట్లాడే డ్రైవర్​, వీల్ చైర్ యాక్సెసబుల్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయట. ట్యాక్సీ ఫ్రీ రైడ్​ కోసం, ట్యాక్సీ ఎక్కిన ప్రయాణికుల్లోని ఒకరు లియాంగ్​తో కలిసి పాటపాడాలి. ఒకవేళ పాడేందుకు ప్రయాణికులు సిగ్గు పడితే వారిని చింగ్ భలే ఎంకరేజ్ చేస్తాడు. అలా పాడండీ ఇలా పాడండీ అంటూ ప్రోత్సహిస్తాడు. అలా అతని మ్యూజిక్ ప్రయాణీకుల పాటలు కలిపి వీడియో తీస్తాడు.

ఆవీడియోను తన యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేస్తాడు. అలా చింగ్ ఇప్పటి వరకూ 10వేలకు పైగా వీడియోలను అప్ లోడ్ చేస్తాడు. అలా డబ్బుల సంపాదిస్తాడు. ఒక పక్క తనకు ఇష్టమైన మ్యూజిక్..పాటలను ఎంజాయ్ చేస్తూ మరోపక్క ప్రయాణీకులకు డబ్బు ఆదా చేస్తూ..తనకు వారికి కూడా ఆదాయంతో పాటు ఆనందం ప్లస్ ఆదాయం చేకూర్చుకోవటం ఈ చింగ్ పాలసీ అన్నమాట.

ఈ ఆఫర్ గురించి చింగ్ లియాంగ్ మాట్లాడుతూ..‘‘నేను 27 ఏళ్లుగా ట్యాక్సీ నడుపుతున్నా. ఎనిమిది సంవత్సరాలుగా కరవోకే పాడే వారికి గిఫ్టులు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నా. ఇవన్నీ ఆరేళ్లుగా వీడియోలు తీస్తున్నా. ఇప్పటికి 10వేల వీడియోలు తీశా” అని చెప్పాడు. అలా పాపులర్ అయి 10 విభిన్నమైన భాషల టీవీ షోల్లో కనిపించానని తెలిపాడు. కాగా చింగ్ ఈ కరోనా కాలంలో తన ట్యాక్స్ీ ఎక్కే వారి కోసం తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు.మాస్కులు తప్పనిసరి చేశాడు. అలా తన ట్యాక్సీని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతాడు. నిత్యం శానిటైజ్ చేస్తాడు.

నాలాగా ఒకేసారి పాడడం, వీడియో తీయడం చాలా కష్టం. కానీ నాకు అది చాలా ఇష్టం. అలా చేసేటప్పుడు ఒక్కోసారి సౌండ్ బయటికి వస్తుంది కాబట్టి పోలీసులు దానికి ఫైన్లు వేస్తారు. కాబట్టి రెండు పనులు చాలా కష్టం” అని ట్యాక్సీ డ్రైవర్ చింగ్ లియాంగ్ తెలిపాడు. కాగా చింగ్ యూట్యూబ్​లో అప్​లోడ్ చేసిన చాలా వీడియోలకు మిలియన్​కు పైగా వ్యూస్ వచ్చాయి. 57 ఏళ్ల ఈ తైవాన్ ట్యాక్సీ డ్రైవర్ చింగ్ లియాంగ్ తీసిన వీడియోలు మీ కోసం..