Taliban మా పెన్నులు విరగ్గొట్టొద్దు..పుస్తకాలను కాల్చొద్దు..అప్ఘాన్‌‌లో నిరసనలు

బాలికల విద్యపై కఠిన ఆంక్షలు నిరసిస్తూ మహిళా బృందం స్కూల్ ముందు నిరసనకు దిగారు. మా పెన్నులు విరగ్గొట్టొద్దు..మా పుస్తకాలను కాల్చొద్దు..అంటూ బ్యానర్లు పట్టుకుని ధర్నా నిర్వహించారు.

Taliban మా పెన్నులు విరగ్గొట్టొద్దు..పుస్తకాలను కాల్చొద్దు..అప్ఘాన్‌‌లో నిరసనలు

Taliban

Women Protesters In Kabul : అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ప్రజలపై దారుణాలకు పాల్పడుతున్నారు. బహిరంగంగా శిక్షలు అమలు చేస్తామని చెప్పిన తాలిబన్లు అనుకున్నట్లుగానే చేయడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా మహిళలపై అణిచివేస్తున్నారు. నిబంధనలు, ఆంక్షలు పెడుతున్నారు. మీడియాపై కూడా అణిచివేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాలికల విద్యపై కఠిన ఆంక్షలు విధించారు. వారిని పాఠశాలల్లోకి అనుమతించడం లేదు. తాలిబన్ల అరాచక పాలనపై మహిళలు ధైర్యంగా పోరాడుతున్నారు. అప్ఘాన్ లోని పలు ప్రాంతాల్లో నిరనన ప్రదర్శనలు చేపడుతున్నారు. తాజాగా..నిరసన చేపడుతున్న మహిళలను అడ్డుకున్నారు.

Read More : Smart Watch Saves Man Life : గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్‌వాచ్‌..చావుబతుకుల్లో ఉన్న అతని ప్రాణం కాపాడింది

బాలికల విద్యపై కఠిన ఆంక్షలు నిరసిస్తూ..ఆరుగురు మహిళా బృందం ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు. మా పెన్నులు విరగ్గొట్టొద్దు..మా పుస్తకాలను కాల్చొద్దు..అంటూ బ్యానర్లు పట్టుకుని ధర్నాకు దిగారు.  ఈ విషయం తెలుసుకున్న తాలిబన్లు అక్కడకు చేరుకున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

Read More : Swachh Bharat 2.0 : స్వచ్ఛ భారత్ 2.0 ని ప్రారంభించిన మోదీ

వారిని వెనక్కి నెట్టి..బ్యానర్లు లాగేసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెనక్కి వెళ్లకపోయేసరికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీనిని కవర్ చేస్తున్న ఓ విదేశీ జర్నలిస్టును రైఫిల్ తో కొట్టినట్లు తెలుస్తోంది. మహిళలు స్పాంటేనియస్ మూవ్ మెంట్ ఆఫ్ అప్ఘాన్ యాక్టివిస్ట్స్ బృందానికి చెందిన వారు. ఈ ఘటనపై మౌలావి నస్రతుల్లా మాట్లాడుతూ…ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వెల్లడిస్తున్నారు. నిరసన తెలియచేసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ తెలిపారు.