Russia-Ukraine : రష్యా, యుక్రెయిన్‌ మధ్య చర్చలు విఫలం

క్రిమియా నుంచి కూడా రష్యన్ బలగాలు తొలగించాలని యుక్రెయిన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు రష్యా కండిషన్స్ పెట్టింది. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్‌ చేసింది.

Russia-Ukraine : రష్యా, యుక్రెయిన్‌ మధ్య చర్చలు విఫలం

Talks Fail (1)

Russia Ukraine Talks failed : రష్యా, యుక్రెయిన్‌ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. బెలారస్‌ సరిహద్దు ఫ్యాపిట్‌ వేదికగా మూడున్నర గంటలకు పైగా రెండు దేశాల ప్రతినిధులు చర్చించారు. రష్యా నుంచి ఐదుగురు, యుక్రెయిన్ నుంచి ఆరుగురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తక్షణమే యుద్ధం విరమించాలని యుక్రెయిన్‌ ప్రధానంగా డిమాండ్‌ చేసింది. రష్యా బలగాలు వెనక్కి వెళ్లాలని పట్టుబట్టింది.

క్రిమియా నుంచి కూడా రష్యన్ బలగాలు తొలగించాలన్న యుక్రెయిన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు రష్యా కండిషన్స్ పెట్టింది. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్‌ చేసింది. నాటోలో చేరబోమని యుక్రెయిన్‌ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఇరుదేశాల ప్రతినిధులు తగ్గకపోవడంతో చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదు.

Russia Ukraine Discussions : రష్యా-యుక్రెయిన్‌ కీలక చర్చలు.. రష్యా ముందు యుక్రెయిన్ రెండు డిమాండ్లు

మరోవైపు బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు నడుస్తోంది. కీలకమైన కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా… యుక్రెయిన్ ఆర్మీ కూడా దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు కీవ్‌ నగరం తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్‌ ఆర్మీ ప్రకటించింది. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని ప్రకటించింది.

అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా మార్చుతోంది యుద్ధం. యుద్ధం మొదలయిన తర్వాత 5 లక్షల మంది పౌరులు యుక్రెయిన్‌ను విడిచి వెళ్లారని యూఎన్ తెలిపింది. మిస్సైల్స్, బాంబుల దాటికి వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయని… లక్ష మందికి పైగా నిరాశ్రులయ్యారని యూఎన్‌ వెల్లడించింది. మరోవైపు యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు నాటో ముందుకొచ్చింది. డిఫెన్స్ మిస్సైల్స్, యాంటీ ట్యాంక్‌ వెపన్స్‌ను పంపిస్తామని ప్రకటించింది. యుక్రెయిన్‌కు ఫైటర్‌ జెట్లను పంపింది ఈయూ.

Ukraine Hunger Cries : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో ఆకలి కేకలు

అయితే కీవ్‌లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దారులు తెరిచామని స్పష్టం చేశారు. తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదన్న పుతిన్… పౌరులపై దాడులు చేయమని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కౌంటర్ ఇచ్చారు. రష్యా సైనికులు యుక్రెయిన్‌ను విడిచి తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తోన్నారు.