Ukraine Hunger Cries : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో ఆకలి కేకలు

సూపర్‌ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్‌ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.

Ukraine Hunger Cries : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో ఆకలి కేకలు

Super Market

Hunger cries in Ukraine : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఓవైపు యుద్ధం.. మరోవైపు కర్ఫ్యూ విధించడంతో యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలో చాలా సూపర్‌ మార్కెట్లు, ఫుడ్ స్టోర్స్ మూసివేశారు. తాజాగా కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు యుక్రెయిన్లు సూపర్ మార్కెట్ల వద్ద బారులు తీరారు. కీవ్‌లోని పలు చోట్ల సూపర్ మార్కెట్లు, ఫుడ్‌ స్టోర్స్ వద్ద ప్రజలు భారీగా క్యూలైన్లలో నిల్చున్నారు. ఒక్కసారిగా జనాలు ఎగబడటంతో క్షణాల్లో సూపర్‌ మార్కెట్లలోని సరుకులు ఖాళీ అవుతున్నాయి.

సూపర్‌ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్‌ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో మూసివేసిన సూపర్ మార్కెట్లు, ఫుడ్ స్టోర్స్‌ను వెంటనే ఓపెన్ చేయాలని కీవ్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిమిత సామర్థ్యంతో పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌కు అనుమతిచ్చారు. కాగా.. కీవ్‌లో 36 గంటల పాటు కొనసాగిన కర్ఫ్యూని ఎత్తివేశారు. దీంతో పెద్ద ఎత్తున యుక్రెయిన్లు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

Russia-Ukraine : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య ప్రారంభమైన చర్చలు

ఓ వైపు చర్చలు… మరోవైపు యుద్ధం… బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు నడుస్తోంది. కీలకమైన కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా… యుక్రెయిన్ ఆర్మీ కూడా దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు కీవ్‌ నగరం తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్‌ ఆర్మీ ప్రకటించింది. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయ ప్రకటించింది. రష్యా యుద్ధంతో యుక్రెయిన్‌లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారని యూఎన్‌ ప్రకటించింది.

అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా యుద్ధం మార్చుతోంది. యుద్ధం మొదలయిన తర్వాత 4 లక్షల 22 వేల మంది పౌరులు యుక్రెయిన్‌ను విడిచి వెళ్లారని యూఎన్ తెలిపింది. మిస్సైల్స్, బాంబుల దాటికి వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయని… లక్ష మందికి పైగా నిరాశ్రులయ్యారని యూఎన్‌ వెల్లడించింది. మరోవైపు యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు నాటో ముందుకొచ్చింది. డిఫెన్స్ మిస్సైల్స్, యాంటీ ట్యాంక్‌ వెపన్స్‌ను పంపిస్తామని ప్రకటించింది. యుక్రెయిన్‌కు ఫైటర్‌ జెట్లను పంపింది ఈయూ.

Ukraine : యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన

మరోవైపు రష్యా-యుక్రెయిన్‌ మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. బెలారస్‌ సరిహద్దు ఫ్యాపిట్‌ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ తరుపున రక్షణశాఖ మంత్రి చర్చలకు హాజరయ్యారు. చర్చల్లో భాగంగా ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది యుక్రెయిన్. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.

రష్యా సైన్యం వెంటనే వెనక్కి వెళ్లిపోవాలన్నది యుక్రెయిన్ రెండవ డిమాండ్. అయితే నాటోలో చేరబోమని యుక్రెయిన్ రాతపూర్వక హామీ ఇవ్వాలని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేస్తేనే యుక్రెయిన్ డిమాండ్లను అంగీకరిస్తామంటోంది. మరోవైపు తక్షణమే తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని యుక్రెయిన్ కోరుతోంది.