Ukraine : యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన

191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 816 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది.

Ukraine : యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన

Ukrainne Defence

Ukrainian Ministry of Defence : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా బలగాలకు యుక్రెయిన్ సైన్యం ధీటైన సమాధానం చెబుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. యుద్ధంలో 5,300 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని పేర్కొంది. 191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 816 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది. కాగా, ఇప్పటివరకు తమ దేశ నష్టాన్ని రష్యా ప్రకటించలేదు.

రష్యా సైనికులకు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే యుక్రెయిన్ విడిచి ప్రాణాలు కాపాడుకోండి అంటూ హెచ్చరించారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడుతున్నామని చెప్పారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తే ఖైదీలను వదిలివేస్తామని ప్రకటించారు.

Russia-Ukraine war :.‘మా దేశం విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకోండి’ రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వార్నింగ్.

మరోవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్‌ వేదికగా రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. యుక్రెయిన్ తరపున చర్చల్లో ఆ దేశ రక్షణమంత్రి పాల్గొన్నారు. తక్షణమే రష్యా యుక్రెయిన్‌పై దాడులు ఆపాలని… సైన్యాన్ని వెనక్కి పంపాలని చర్చలకు ముందు యుక్రెయిన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగుస్తుందో.. కొననసాగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

కీవ్‌లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దారులు తెరిచామని స్పష్టం చేశారు. తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదన్న పుతిన్… పౌరులపై దాడులు చేయమని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కౌంటర్ ఇచ్చారు. రష్యా సైనికులు యుక్రెయిన్‌ను విడిచి తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. అలాగే తక్షణమే తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తోన్నారు.

Russia-Ukraine : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య ప్రారంభమైన చర్చలు

అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే… మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది. చర్చలకు ముందు రష్యా, యుక్రెయిన్ చేసిన ప్రకటనలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్ మొత్తం తమ ఆధీనంలో ఉందని రష్యా ప్రకటించింది. ఆ తర్వాత కాసేపటికే యుక్రెయిన్ భిన్నమైన ప్రకటన చేసింది. యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.

పౌరుల నివాసాలపైనా రష్యా ఆర్మీ దాడులు చేసిందని, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యుక్రెయిన్‌ను ఆక్రమించుకోలేకపోయిందని ఆరోపించింది. అయితే యుక్రెయిన్ ఆరోపణలను తోసిపుచ్చింది రష్యా. ప్రజలను యుక్రెయిన్ ఆర్మీ మానవకవచంలా వాడుకుంటోందని ఎదురుదాడి చేసింది. రష్యా దళాలకు యుక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఉందని బ్రిటన్ అంటోంది. కీవ్‌కు 30కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు నిలిచిపోయాయని బ్రిటన్ ప్రకటించింది.

Russia-Ukraine war : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ..

మరోవైపు యుద్ధం, ఆంక్షలతో రష్యా ఆర్థికవ్యవస్థ పతనమవుతోంది. ఇది భారంగా మారడంతో ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలకనిర్ణయాలు తీసుకుంటోంది రష్యా. వడ్డీరేట్లను 9.5శాతం నుంచి ఏకంగా 20శాతానికి పెంచింది సెంట్రల్ బ్యాంక్. విదేశీ కరెన్సీలో ఉన్న ఆదాయాన్ని 80శాతం అమ్ముకుని రూబుల్ కొనాలనీ ఆదేశించింది. అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా మార్చుతోంది యుద్ధం. యుద్ధం మొదలయిన తర్వాత 4లక్షలమంది పౌరులు
యుక్రెయిన్‌ను వీడి వెళ్లిపోయారు.