Russia Ukraine Discussions : రష్యా-యుక్రెయిన్‌ కీలక చర్చలు.. రష్యా ముందు యుక్రెయిన్ రెండు డిమాండ్లు

చర్చల్లో భాగంగా యుక్రెయిన్ ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.

Russia Ukraine Discussions : రష్యా-యుక్రెయిన్‌ కీలక చర్చలు.. రష్యా ముందు యుక్రెయిన్ రెండు డిమాండ్లు

Russia Ukraine

Russia Ukraine discussions : రష్యా-యుక్రెయిన్‌ మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. బెలారస్‌ సరిహద్దు ఫ్యాపిట్‌ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ తరుపున రక్షణశాఖ మంత్రి చర్చలకు హాజరయ్యారు. చర్చల్లో భాగంగా యుక్రెయిన్ ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.

రష్యా సైన్యం వెంటనే వెనక్కి వెళ్లిపోవాలన్నది యుక్రెయిన్ రెండవ డిమాండ్. అయితే నాటోలో చేరబోమని యుక్రెయిన్ రాతపూర్వక హామీ ఇవ్వాలని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేస్తేనే యుక్రెయిన్ డిమాండ్లను అంగీకరిస్తామంటోంది. మరోవైపు తక్షణమే తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని యుక్రెయిన్ కోరుతోంది. ఓ వైపు చర్చలు… మరోవైపు యుద్ధం… బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లిపోతోంది.

Ukraine Hunger Cries : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో ఆకలి కేకలు

రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు నడుస్తోంది. కీలకమైన కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా… యుక్రెయిన్ ఆర్మీ కూడా దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు కీవ్‌ నగరం తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్‌ ఆర్మీ ప్రకటించింది. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయ ప్రకటించింది.

రష్యా యుద్ధంతో యుక్రెయిన్‌లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతిచెందారని యూఎన్‌ ప్రకటించింది. అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా మార్చుతోంది యుద్ధం. యుద్ధం మొదలయిన తర్వాత 5 లక్షల మంది పౌరులు యుక్రెయిన్‌ను విడిచి వెళ్లారని యూఎన్ తెలిపింది. మిస్సైల్స్, బాంబుల దాటికి వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయని… లక్ష మందికి పైగా నిరాశ్రులయ్యారని యూఎన్‌ వెల్లడించింది.

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు..కీవ్‌ నగరం మా ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్‌ ఆర్మీ

మరోవైపు యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు నాటో ముందుకొచ్చింది. డిఫెన్స్ మిస్సైల్స్, యాంటీ ట్యాంక్‌ వెపన్స్‌ను పంపిస్తామని ప్రకటించింది. యుక్రెయిన్‌కు ఫైటర్‌ జెట్లను పంపింది ఈయూ. అయితే కీవ్‌లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దారులు తెరిచామని స్పష్టం చేశారు.

తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదన్న పుతిన్… పౌరులపై దాడులు చేయమని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కౌంటర్ ఇచ్చారు. రష్యా సైనికులు యుక్రెయిన్‌ను విడిచి తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.