Elon Musk: ఎలన్ మస్క్‌కు షాక్.. తగ్గిపోతున్న సంపద.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి పడిపోయిన మస్క్

ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయాడు.

Elon Musk: ఎలన్ మస్క్‌కు షాక్.. తగ్గిపోతున్న సంపద.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి పడిపోయిన మస్క్

Elon Musk: టెస్లా, ట్విట్టర్ సంస్థల సీఈవో ఎలన్ మస్క్‌కు షాక్ తగిలింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న మస్క్ తాజాగా తన స్థానాన్ని కోల్పోయాడు. నెంబర్ వన్ స్థానం నుంచి రెండో స్థానానికి దిగజారాడు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు.

CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

‘లూయిస్ విట్టన్’ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ మొదటి స్థానం సంపాదించుకున్నాడు. అయితే, కొద్దిసేపట్లోనే మస్క్ తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకున్నాడు. మస్క్ మళ్లీ తన సంపద పెంచుకుని మొదటి స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ ఇద్దరి సంపద మధ్య తేడా స్వల్పంగానే ఉంది. దీంతో మొదటి స్థానం కోసం వీరిమధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం మస్క్ సంపద 185.8 బిలియన్ డాలర్లుకాగా, ఆర్నాల్ట్ సంపద 185.7 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 21 నుంచి ఎలన్ మస్క్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఆయన తన స్థానం కోల్పోవడం ఇదే మొదటిసారి. మస్క్ కంటే ముందు అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉండేవారు. ఆయనను వెనక్కు నెట్టేసి మస్క్ మొదటి స్థానం సంపాదించాడు. ఈ సమయంలో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే, క్రమంగా ఆయన సపంద తరుగుతూ వచ్చింది.

Summer In India: ముందుగానే రానున్న ఎండాకాలం.. ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న ప్రపంచ బ్యాంకు

దీనికి కారణం ఆయన ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేయడమే. ట్విట్టర్ సంస్థను మస్క్ 44 బిలియన్ డాలర్లు వెచ్చించి కొన్న సంగతి తెలిసిందే. దీనికోసం ఎక్కువ నిధులు సమకూర్చాల్సి వచ్చింది. అలాగే ప్రస్తుతం మస్క్ ట్విట్టర్‌పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో ఆయన ప్రధాన కంపెనీ అయిన టెస్లా షేర్లు క్రమంగా పడిపోయాయి. దీంతో మస్క్ సంపద తగ్గింది. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో మస్క్, ఆర్నాల్డ్ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు గౌతమ్ అదానీ. ఆ తర్వాత నాలుగో స్థానంలో జెఫ్ బెజోస్, ఐదో స్థానంలో వారెన్ బఫెట్ కొనసాగుతుండగా, భారత పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు.