Summer In India: ముందుగానే రానున్న ఎండాకాలం.. ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న ప్రపంచ బ్యాంకు

దేశంలో వచ్చే ఏడాది నుంచి ఎండలు మండబోతున్నాయి. ప్రజలు భరించలేనంతగా ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తేల్చింది.

Summer In India: ముందుగానే రానున్న ఎండాకాలం.. ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న ప్రపంచ బ్యాంకు

Summer In India: ఇకపై దేశంలో ఎండాకాలం త్వరగానే ప్రారంభమవుతాయని, ప్రజలు భరించలేనంతగా ఎండలు మండుతాయని ప్రపంచ బ్యాంకు నివేదిక ఒకటి వెల్లడించింది. రాబోయే కాలంలో ఎండలు మనిషి ప్రాణాలకు ముప్పుగా మారుతాయని ఆ నివేదిక తేల్చింది.

Himachal Pradesh: ‘ఆపరేషన్ లోటస్’ భయం.. ఎమ్మెల్యేల్ని రాజస్థాన్ తరలించేందుకు కాంగ్రెస్ ప్లాన్

‘క్లైమేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చ్యునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’ పేరుతో ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో ఇండియాలో ఎండలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా ఇండియాలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వడగాడ్పుల కారణంగా వందలాది మంది మరణిస్తున్నారు. భూతాపం 1.5 డిగ్రీలు పెరిగితే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎండలు పెరుగుతాయి. ఇక ఇండియాలో అయితే, మానవులు తట్టుకోగలిగే స్థాయిని దాటి ఎండలు మండుతాయి. సాధారణ వేసవి కాలంకన్నా ముందే ఈసారి ఎండాకాలం ప్రారంభమవుతుంది. అది కూడా ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఎండలు, వడగాడ్పుల ప్రభావంతో పలువురు మరణించే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా కూడా దేశంపై ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

మన దేశమే కాదు.. శీతల దేశాలుగా పేరున్న వాటిలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మన దేశంలో పని చేసే ప్రజల్లో 75 శాతం.. అంటే 38 కోట్ల మంది కూలీలు ఎండలోనే పని చేస్తారు. 2030కల్లా వీళ్లంతా ఎండల వల్ల ప్రాణహాని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎండల ప్రభావంతో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగాలు కోల్పోయే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఉంటే, వారిలో 3.4 కోట్ల మంది ఇండియాలోనే ఉంటారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.