Himachal Pradesh: ‘ఆపరేషన్ లోటస్’ భయం.. ఎమ్మెల్యేల్ని రాజస్థాన్ తరలించేందుకు కాంగ్రెస్ ప్లాన్

గురువారం గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది.

Himachal Pradesh: ‘ఆపరేషన్ లోటస్’ భయం.. ఎమ్మెల్యేల్ని రాజస్థాన్ తరలించేందుకు కాంగ్రెస్ ప్లాన్

Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీకి ‘ఆపరేషన్ లోటస్’ భయం పట్టుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేల్ని బీజేపీ తన వైపు తిప్పుకుంటుందేమోనని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.

CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలియజేశాయి. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వనున్న నేపథ్యంలో అధికారం కోసం బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’కు పాల్పడే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని హిమచల్ ప్రదేశ్ నుంచి వేరే చోటుకు తరలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యేల్ని రాజస్థాన్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీని కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్ని రాజస్థాన్ తరలించే బాధ్యతను ఆ పార్టీ అధిష్టానం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించనున్నారు.

Jammu & Kashmir: జమ్ము-కాశ్మీర్‌ను వణికిస్తున్న చలి.. మైనస్ 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దీని కోసం ఆమె షిమ్లా చేరుకునే అవకాశాలున్నాయి. 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 35 సీట్లు సాధించాలి. అక్కడ వరుసగా ఒక పార్టీ రెండోసారి అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. ఈ సంప్రదాయం ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయి.