Jammu & Kashmir: జమ్ము-కాశ్మీర్‌ను వణికిస్తున్న చలి.. మైనస్ 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

జమ్ము-కాశ్మీర్ లోయను చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

Jammu & Kashmir: జమ్ము-కాశ్మీర్‌ను వణికిస్తున్న చలి.. మైనస్ 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Jammu & Kashmir: జమ్ము-కాశ్మీర్‌ను చలి వణికిస్తోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జమ్ము లోయలోని అనేక ప్రాంతాల్లో రాత్రిపూట మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పహల్గాం ప్రాంతంలో మైనస్ 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

ఈ నెల 9-13 వరకు జమ్ము-కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, అలాగే మంచు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఇక్కడి చాలా ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతే నమోదవుతోంది. అలాగే తక్కువ స్థాయి నుంచి మధ్యస్థాయిలో మంచు కురుస్తుంది. కొన్నిచోట్ల అధికంగా మంచు కురిసే అవకాశం ఉంది. దేశంలో అత్యధిక చలి ఉండే ప్రాంతాల్లో జమ్ము-కాశ్మీర్ ఒకటి. శీతాకాలం ఇక్కడ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. అనేక ప్రాంతాలు మంచుతో కప్పి ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఏడాది డిసెంబర్ 21 నుంచి అక్కడ అసలైన శీతాకాలం ప్రారంభమవుతుంది.

స్థానికులు ఈ కాలాన్ని‘చిల్లయ్ కాలాన్’ అని పిలుస్తారు. ఈ సమయంలో రోడ్లపై భారీగా మంచు కురవడం వల్ల రవాణా, జనజీవనం స్తంభిస్తుంది. జమ్ముతో లదాక్ ప్రాంతంలోనూ టెంపరేచర్ తగ్గిపోయింది. లదాఖ్‌లో మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే, లేహ్ ప్రాంతంలో కూడా మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రతే నమోదైంది.