ChatGPT: ద్యావుడా.. ఎంత పనిచేసింది చాట్‌జీపీటీ .. దాన్ని నమ్మి విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన ప్రొఫెసర్

ChatGPT యూనివర్శిటీ విద్యార్ధుల్ని దగా చేసింది. ఓ ప్రొఫెసర్ పప్పులో కాలేసేలా చేసింది. విద్యార్ధులకు ప్రొఫెసర్ క్షమాపణలు చెప్పేలా చేసింది.మరి ChatGPT మానవ పనులకు ప్రత్యామ్నాయం అని చెప్పి తీరాలా?

ChatGPT: ద్యావుడా.. ఎంత పనిచేసింది చాట్‌జీపీటీ .. దాన్ని నమ్మి విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన ప్రొఫెసర్

ChatGPT for resume

Texas university ChatGPT: ఇప్పుడంతా కంప్యూటర్ యుగంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. టెక్నాలజీ యుగంలో త్రేతాయుగంలో శ్రీరాముడు ఎలా ఉండేవాడో కూడా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చూపించేస్తోంది. ఇలా AI యుగం నడుస్తోంది. టెక్నాలజీ అనేదాన్ని సద్వినియోగం చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. కానీ ఒక్కోసారి బొక్కబోర్లా కూడా పడవచ్చు కూడా. అదే జరిగింది కొంతమంది విద్యార్ధులు విషయంలో. పరీక్షలు రాసిన విద్యార్ధుల్ని దగా చేసింది ChatGPT. ఓ ప్రొఫెసర్ ChatGPTని నమ్మి విద్యార్ధులందరిని ఫెయిల్ చేసిన ఘనకార్యం అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

టెక్సాస్ యూనివర్సిటీలోని విద్యార్థులు ఫైనల్‌ ఎగ్జామ్స్ లో భాగంగా కొన్ని ఆర్టికల్స్ రాసి సబ్‌మిట్ చేశారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. స్టూడెంట్స్ సబ్‌మిట్ చేసిన వ్యాసాలు విద్యార్థులు కంప్యూటర్‌ ద్వారా రాశారని ChatGPT చెప్పింది. అంతే..సాక్షాత్తు టెక్నాలజీయే చెప్పింది కదాన్ని సదరు ప్రొఫెసర్ ఏమాత్రం ఆలోచించకుండా విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. దీంతో విద్యార్ధులంతా లబోదిబోమన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు ఇంకా అయితే ఐదు లేక పదిమంది ఫెయిల్ అయ్యారనుకోవచ్చు. కానీ అందరు ఎలా ఫెయిల్ అవుతారు? దీంతో వెరిఫై చేయగా అసలు విషయం తెలిసింది. టెక్నాలజీ తప్పు చెప్పిందని నిర్దారణ అయ్యింది. చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. అంతేకాదు..విద్యార్థులు స్వయంగా రాశారని తెలిసింది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. విద్యార్ధులకు మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చింది.

21 years Sri Ram : 21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఇంత అందంగా ఉండేవాడట..!!

చాట్‌జీపీటీ అనేది ఓపెన్‌ ఏఐ(Open AI) డెవలప్ చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది రకరకాల కంటెంట్‌ను రాయగలదు. వివిధ భాషలను అనువదించగలదు. అంతేకాకుండా యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాచారం రూపంలో సమాధానం ఇస్తుంది. కానీ అన్నిసార్లు కరెక్ట్ అని అనుకోవటానికి వీల్లేదని టెక్సాస్ వర్శిటీలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది. అలాగే ఏఐ మానవ తీర్పుకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలనేలా ఈ ఘటన ఉంది.