మాస్క్ ఉంటేనే షాపు డోర్ తెరుచుకుంటుంది

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2020 / 06:28 PM IST
మాస్క్ ఉంటేనే షాపు డోర్ తెరుచుకుంటుంది

doors shut to customers not wearing masks: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మాస్క్ లు ధరించాలంటూ ప్రభుత్వాలు మొత్తుకొని చెబుతున్నా ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోవడంలో లేదు. కరోనా విజృంభణ కొనసాగుతున్నా కూడా ఇంకా కొంతమంది మాస్క్ లు లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. కొన్ని చోట్ల మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని ప్రశ్నించినవారిపై దాడులు కూడా చేస్తున్నారు.



అయితే,ధాయ్ లాండ్ లో ఓ షాపు మాత్రం మాస్క్ ఉంటేనే మా షాపులోకి ఎంట్రీ అంటోంది. ఈ కరోనా కాలంలో ఇలాంటివి చాలా విన్నాం అనుకుంటే పొరపాటే. మిగతావాళ్లలా కాకండా… కేవలం మాస్క్ ఉన్న కస్టమర్లే తమ షాపులోకి ప్రవేశించేలా ధాయ్ లాండ్ లోని ఓ షాపు యజమాని ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

కస్టమర్ మాస్క్ ధరించాడా లేదా అని స్కాన్ చేసే ఓ మెషీన్ ని షాపు డోర్ కి బిగించారు. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా ఇది చెక్ చేస్తుంది. కస్టమర్ కి మాస్క్ ఉండి..జ్వరం లేకుండా ఉంటేనే డోర్ తెరుచుకుంటుంది. ఒకవేళ కస్టమర్ కి మాస్క్ లేకున్నా లేదా జర్వం ఉన్నా డోర్ తెరుచుకోదు. దీనికి సంబంధించిన వీడియోను నియాల్ హర్బిసన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు.


ఈ వ్యవస్థ చాలా బాగుందంటూ నెటిజన్లు ట్వీట్ లు చేస్తున్నారు. షాపుల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కి కస్టమర్లతో వాదించే బాధ కూడా తప్పుతుదంటూ నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. అమెరికాలో కూడా ఇలా చేసి ఉంటే అక్కడ ఇన్ని కరోనా కేసులు వచ్చేవి కావేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.