Home » International » ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన : ఆపరేషన్ చేస్తున్న వైద్యుడిని వీడియో కాల్ ద్వారా విచారించిన కోర్టు
Updated On - 12:50 pm, Sun, 28 February 21
The court heard the doctor via video call : ఓ వైపు రోగి ప్రాణం కాపాడే ప్రయత్నం… అటు న్యాయ వ్యవస్థపై గౌరవం… రెండు విధులను ఏకకాలంలో నిర్వహించాడో వైద్యుడు… అమెరికాలోని సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సెన్షన్స్ కోర్టు ఓ కేసు నిమిత్తం ఓ వైద్యుడిని వీడియో కాల్ ద్వారా విచారించింది. ఆ సమయంలో అతను చేస్తున్న పని చూసి న్యాయమూర్తి కూడా అవాక్కయ్యాడు. చివరికి విచారణ కొనసాగిద్దామా అని కూడా డాక్టర్‌ను న్యాయమూర్తి కోరాడు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన నేరంపై ఓ వైద్యుడిని శాక్రమెంట్రో సుపీరియర్ కోర్టు విచారించింది. కరోనా కారణంగా అన్ని కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు విచారిస్తోంది. అలాగే డాక్టర్ స్కాట్ గ్రీన్‌కు కూడా వీడియో లింక్ పంపించారు. ఆ సమయంలో డాక్టర్ సర్జికల్ సూట్ ధరించి ఉన్నాడు. ఎక్కడున్నావని జడ్జి ప్రశ్నించగా.. ఆపరేషన్ ధియేటర్‌లో ఉన్నాననే సమాధానంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సాధ్యమైనా… ఏమైనా సమస్యలున్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పర్లేదు సార్… అని డాక్టర్ బదులు చెప్పడంతో… విచారణను వేగంగా పూర్తి చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. మరోసారి ఇలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.
Covid Dust : షాకింగ్.. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడ
రష్యా అధికారులను బహిష్కరించిన అమెరికా.. కొత్త ఆంక్షలు
Actor case : జంతిక తిన్న నటికి బ్రెయిన్ డ్యామేజ్..రూ. 220 కోట్ల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు
రక్తపుమడుగులో భార్యాభర్తలు.. శరీరాలపై కత్తిపోట్లు.. బాల్కనీలో చిన్నారి.. అమెరికాలో భారత జంట అనుమానాస్పద మృతి..
Medtronic Engineering Centre : అమెరికా తర్వాత హైదరాబాదే.. రూ.1200కోట్ల పెట్టుబడులు.. మెడ్‌ట్రానిక్ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్
అర్థరాత్రి వీడియో కాల్లో మాట్లాడుతూ ఊహించని పని చేసిన ప్రియుడు, షాక్‌లో ప్రియురాలు