Warrior Dog : యుక్రెయిన్‌తో రష్యా వార్ లో వారియర్‌గా మారిన కుక్క..వేలమంది ప్రాణాలను కాపాడింది

యుద్ధరంగంలో ఇప్పుడది ఓ మిస్సైల్‌లా దూసుకుపోతోంది. వయసు రెండేళ్లే కానీ .. నూరేళ్లు గుర్తుండిపోయేలా దేశసేవ చేస్తోంది. అందుకే యుక్రెయిన్‌ ప్రజలకు .. ఇప్పుడది సూపర్‌ హీరో.

Warrior Dog : యుక్రెయిన్‌తో రష్యా వార్ లో వారియర్‌గా మారిన కుక్క..వేలమంది ప్రాణాలను కాపాడింది

Dog

dog became a warrior : యుక్రెయిన్‌తో రష్యా వార్‌లో.. వారియర్‌గా మారింది ఓ కుక్క. మాతృభూమి కోసం మీరే కాదు .. నేను సైతం అంటోంది. బాల్‌తో ఆడుకున్నంత ఈజీగా .. బాంబులతో ఆడేసుకుంటోంది. మనుషులు సైతం భయంతో పరుగులుపెట్టే చోట .. శత్రువుల వ్యూహాలను తెలివిగా తిప్పికొడుతోంది. యుద్ధరంగంలో ఇప్పుడది ఓ మిస్సైల్‌లా దూసుకుపోతోంది. వయసు రెండేళ్లే కానీ .. నూరేళ్లు గుర్తుండిపోయేలా దేశసేవ చేస్తోంది. అందుకే యుక్రెయిన్‌ ప్రజలకు .. ఇప్పుడది సూపర్‌ హీరో.

దాదాపు రెండు నెలలుగా యుక్రెయిన్‌పై .. రష్యా విరుచుకుపడుతూనే ఉంది. గ్రామాలు.. పట్టణాలు మట్టుబెట్టుకుపోతున్నాయి. మిస్సైల్స్‌.. బాంబుల మోతలతో .. భవనాలు నేలమట్టమవుతున్నాయి. పెద్దలు.. పిల్లలు..మూగజీవాలు.. శవాల గుట్టలుగా మారుతున్నాయి. ఎటుచూసినా నరమేథం .. గుండెల్లో కన్నీటి సుడులను నింపుతోంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలుపగిలేలా రోధిస్తున్నారు.

Russia Warning To Ukraine : తక్షణమే ఆయుధాలు వీడండి.. యుక్రెయిన్ దళాలకు రష్యా మరో వార్నింగ్

ఇంకొందరు దేశం విడిచి ఇతర దేశాలకు.. ప్రాణం మిగిలితే చాలంటూ పరుగులుపెడుతున్నారు. మరికొందరు యుద్ధ వాతావరణం నుంచి బయటపడేందుకు .. బంకర్లలో బతుకు పోరాటం చేస్తున్నారు. అలాంటి సమయంలోనూ పాట్రాన్‌.. యుక్రెయిన్‌కే హీరోలా మారింది. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు.. తన వంతు అంటూ యుద్ధ రంగంలోకి దూకింది. ఇప్పటికే దాదాపు 99 బాంబులను గుర్తించింది. వేల మంది ప్రాణాలను కాపాడింది.

ఇప్పుడు పాట్రాన్‌కు సంబంధించిన ఓ వీడియోను .. స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆఫ్ యుక్రెయిన్ ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో పాట్రన్ గురించి వివరాలను తెలియజేశారు. తమ మిలిటెంట్ డాగ్ యుద్ధంలో తన సేవలను అందిస్తుందని తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 90 పేలుడు పదార్థాలను గుర్తించిందని చెప్పారు. మా మిత్రమా అలుపురాని నీ పనికి ధన్యవాదాలంటూ వీడియోలో తెలిపారు. దీంతో ఈ కుక్క గురించి తెలుసుకున్న నెటిజన్లు మిరాకిల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దానిని జాగ్రత్తగా చూసుకోమంటూ .. సలహాలు ఇస్తున్నారు.

50 Days Russia War : యుక్రెయిన్‌లో మొదటి 50 రోజుల రష్యా యుద్ధం.. ఫొటోలు ఇవే..!

ఇక పాట్రాన్‌.. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన కుక్క. ఈ జాతి కుక్కలను 2వందల ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో నక్కలను వేటాడేందుకు అభివృద్ధి చేశారు. వీటిని పార్సన్ రస్సెల్ టెర్రియర్ జాతి కుక్కలని అంటారు. ఈ జాతి కుక్కలు చాలా ఇండిపెండెంట్‌గా.. చాలా తెలివైనవిగా వ్యవహరిస్తాయి. వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సులభం. మొత్తానికి యుద్ధరంగంలో పాట్రాన్‌ తన టాలెంట్‌ను బయటపెడుతోంది.