Aircraft : అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర..తొలిసారిగా మంచుపై ల్యాండ్ అయిన విమానం

అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర లిఖించబడింది. ఎయిర్ బస్ అంటార్కిటికాలో దిగింది. చరిత్రలో తొలిసారిగా మంచుపై విమానం ల్యాండ్ అయింది.

Aircraft : అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర..తొలిసారిగా మంచుపై ల్యాండ్ అయిన విమానం

Flight Landing

aircraft to land on ice : అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర లిఖించబడింది. ఎయిర్ బస్ అంటార్కిటికాలో దిగింది. చరిత్రలో తొలిసారిగా మంచుపై విమానం ల్యాండ్ అయింది. హై-ఫ్లై ఏవియేషన్ కంపెనీ సాహసం చేసింది. మంచుగడ్డపై 10 వేల అడుగుల రన్ వేను తయారు చేసింది.

నవంబర్ 2 మంగళవారం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి విమానం బయలుదేరింది. 4,506 కిలో మీటర్ల దూరం…5 గంటల ప్రయాణం తర్వాత అంటార్కిటికాలో ల్యాండ్ అయింది. విమానం సరిగా దిగుతుందో లేదో అని పైలెట్, సిబ్బంది టెన్షన్ పడ్డారు.

Srisailam Temple : శ్రీశైలం ఆలయంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం

అంటార్కిటికాలో, అనేక మీటర్ల ఎత్తులో మంచు పొర ఏడాది పొడవునా దట్టంగా ఉంటుంది. ఈ మంచులో విమానం ల్యాండ్ అవడానికి వీలుగా 3000 అడుగుల పొడవున్న రన్‌వే నిర్మించారు. 290 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 223 అడుగుల పొడవైన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందు 2019 – 2020 మధ్య ఇక్కడ సుమారు 6 ట్రయల్స్ నిర్వహించారు.

అంటార్కిటికాలో పనిచేస్తున్న వోల్ఫ్స్ గ్యాంగ్ అనే అడ్వెంచర్ క్యాంప్ ద్వారా ఈ విమానం ప్రారంభించారు. వోల్ఫ్స్ గ్యాంగ్ రిసార్ట్ కోసం అవసరమైన సామాగ్రిని విమానంలో తీసుకువచ్చారు. ఈ విమానాన్ని హై-ఫ్లై వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ కార్లోస్ మిర్పురి నడిపారు. అంటార్కిటికాలో ఈ బృందం దాదాపు 3 గంటలపాటు గడిపింది. మొత్తం ప్రయాణం 2,500 నాటికల్ మైళ్లు సాగింది.