Omicron Death : అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

US తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు.

Omicron Death : అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

Omicron (6)

The first Omicron death in America : అగ్ర రాజ్యం అమెరికాను ఒమిక్రాన్ వేటాడుతోంది. కొత్త రూపంతో యమపాశం విసురుతోంది. ఒమిక్రాన్‌తో US మరోసారి వెంటిలెటర్‌పైకి వెళ్లనుంది. ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. భారీగా కోవిడ్ కేసులు నమోదవడమే కాదు…ఒమిక్రాన్‌తో మరణాలు మొదలయ్యాయి. ఆసుపత్రులు సరిపోవడం లేదు, బెడ్లు నిండుకున్నాయ్. వైద్య సిబ్బందిపై కోవిడ్ ఎఫెక్ట్ ఓ రేంజ్‌లో ఉంది. దీంతో పూర్తిగా వైద్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

డెల్టా వేరియంట్‌తో అమెరికాలో పలు ప్రాంతాలు శవాల దిబ్బగా కనిపించాయి. స్మశాన వాటికలు సరిపోలేదు. ఫ్రీజర్‌లో నెలలుగా మృతదేహాలు ఉంచాల్సిన స్థితికి వెళ్లింది. అయితే ఒమిక్రాన్ అగ్రరాజ్యంలో అంతకు మించి అంటోంది. తాజాగా US తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా 81 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు.. 97 దేశాలకు పాకిన కొత్త వేరియంట్

20 రోజుల కింద అమెరికాలో ఒమిక్రాన్ ఫస్ట్ కేసు నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కేసుల సంఖ్య పెరిగింది. గత వారంకంటే ఇప్పుడు 73 శాతం అధికంగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇది జూన్‌లో డెల్టా వేరియంట్‌ వ్యాపించిన దానికంటే అత్యధికంగా ఉంది. ఇక అగ్రరాజ్యంలోని మొత్తం 48 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించారు. దాదాపు అమెరికా మొత్తం కొత్త వేరియంట్ గుప్పిట్లో ఉంది. ఒకటిన్నర రోజుల నుంచి మూడు రోజుల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.

ప్రపంచమంతా ఇటీవల కరోనా అదుపులో ఉన్నా…అమెరికాలో కంట్రోల్‌లో లేదు. రోజూ లక్షకుపైనే కేసులు వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే కోవిడ్‌ కేసులు లక్షన్నర నిర్ధారించారు. ఇక రెండు వారాల్లో 18 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ కేసులే అత్యధికం. అయితే పాజిటివ్ వచ్చిన వారి నుంచి కొత్త వేరియంట్ ఎంతమందికి సోకిందనే టెన్షన్ వెంటాడుతోంది. వారంతా ఇంకెంత మందిని కలిసి ఉంటారో కనిపెట్టలేని స్థితిలో ఉంది. అయితే రానున్న 3 నుంచి 8 వారాల్లో కోట్ల మందికి వ్యాపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. న్యూయార్క్‌లో అత్యధికంగా 21 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే ఈ ఏడాది జనవరి 14న 19 వేల 942 కేసులు నిర్ధారించగా…ఇప్పుడు అంతకు మించి సోకింది.

Omicron detection Kit : ఒమిక్రాన్ గుర్తించే సరికొత్త కిట్..

పెరుగుతున్న కోవిడ్ కేసులతో అమెరికా వైద్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య సేవలు అందించడం కష్టమవుతోంది. ఇక క్రిస్మస్ పండుగ దగ్గరపడుతున్న కొద్దీ సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. దీంతో వైరస్ ఇంకా ప్రభలే అవకాశం ఉంది. దీంతో ఇక జనవరి నుంచి అమెరికాలో ఒమిక్రాన్ విలయతాండవమే అంటున్నారు.

అమెరికాలో బూస్టర్‌ డోసు ఇస్తున్నప్పటికీ కేసులు భారీగా నమోదవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అగ్రరాజ్యంలో మాస్క్‌, భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదు. మాస్క్ ధరించకపోతే జరిమానా విధించే వ్యవస్థ లేదు. ఇక పార్టీలు, హోటళ్లలో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలారు. అయితే అగ్రరాజ్యంలో నుంచి వచ్చే ప్రయాణికులతో ఇతర దేశాల్లో ఆందోళన మొదలైంది. ఆయా దేశాల్లో అమెరికా నుంచి వచ్చిన వారితో ఒమిక్రాన్ ప్రభలే అవకాశం ఉండటంతో టెన్షన్ పడుతున్నారు.