Donkey In Court: గాడిదలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. న్యాయమూర్తి ఏం చేశారంటే?

చిత్రాల్ జిల్లా సహా పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో కలప పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. కలప అక్రమ రవాణాలో మనుషులు కనిపించరు. కేవలం గాడిదలే కనిపిస్తాయి. అక్కడి స్మగ్లర్లు తెలివిగా అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు.

Donkey In Court: గాడిదలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. న్యాయమూర్తి ఏం చేశారంటే?

Donkey In Court: ఏదైనా తప్పుచేసిన సమయంలో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చడం సర్వసాధారణంగా జరిగే ఘటనలే. కానీ పాకిస్థాన్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలోని చిత్రాల్ జిల్లా దరోశ్ కమిషనర్ ఐదు గాడిదలను కోర్టులో హాజరుపర్చాడు. దీనికి కారణంలేకపోలేదు. ఆ గాడిదలు అధికారుల కళ్లుగప్పి భారీగా కలప అక్రమ రవాణా చేస్తున్నాయట. దీంతో వాటిని పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఈ కేసుపై విచారణ జరిపి చివరికి ఓ తీర్పు ఇచ్చారు.

Koreas exchange warning shots: తెల్లవారుజామునే పరస్పరం హెచ్చరికలు చేస్తూ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కాల్పులు

చిత్రాల్ జిల్లా సహా పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో కలప పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. కలప అక్రమ రవాణాలో మనుషులు కనిపించరు. కేవలం గాడిదలే కనిపిస్తాయి. అక్కడి స్మగ్లర్లు తెలివిగా అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. అక్రమ రవాణాదారులు దుంగలను గాడిదలపైఉంచి తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో కేవలం గాడిదలే కలప అక్రమ రవాణా చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా కలప అక్రమ రవాణా జరుగుతోందని తెలిసిన దరోశ్ అసిస్టెంట్ కమిషనర్ తౌసిఫుల్లా కు సమాచారం అందింది. దాడులు చేయగా.. ముగ్గురిలో ఇద్దరు తప్పించుకోగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. కలపను రవాణా చేస్తున్న గాడిదలను అటవీ అధికారులకు అప్పగించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

రెండురోజుల తరువాత మరోసారి కలప అక్రమ రవాణాదారులతో పాటు మరో మూడు గాడిదలను పట్టుకున్నారు. తొలుత పట్టుకున్నప్పుడు ఆ మూడు గాడిదలను అటవీ అధికారికి అప్పగించగా ఆయన వాటి బాగోగులు చూసుకోవడానికి ఒక స్థానికుడికి వాటిని అప్పగించారు. అయితే, అందులో ఒకటి మళ్లీ స్మగ్లర్ల చేతిలో పడింది. అసిస్టెంట్ కమిషనర్ ఆదేశించడంతో మొత్తం ఐదు గాడిదలను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయవాది .. అక్రమ కలప రవాణాకు పాల్పడిన గాడిదలను అటవీ శాఖ అధికారులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.