Omicron BA5 : ప్రమాదకరంగా ఒమిక్రాన్‌ బీఏ5 వేరియంట్‌..మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా సోకుతున్న వైరస్

కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్‌ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్‌ ప్రమాదకరంగా మారుతోంది. సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

Omicron BA5 : ప్రమాదకరంగా ఒమిక్రాన్‌ బీఏ5 వేరియంట్‌..మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా సోకుతున్న వైరస్

Omicron

Omicron BA5 sub-variant : కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రోజుకో కొత్త రూపంలో మానవాళిపై విజృంభిస్తోంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌పై శాస్త్రవేత్తలు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవటం వల్ల, గతంలో వైరస్‌ బారినపడి కోలుకోవటం వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌ బీఏ.5 హరిస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. వారాల వ్యవధిలోనే వైరస్ మళ్లీ సోకుతోందని వెల్లడించారు. బీఏ.4తో పాటు బీఏ.5 వేరియంట్‌ కారణంగానే భారత్‌, అమెరికా, యూకే, ఇటలీ, చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు.

కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్‌ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్‌ ప్రమాదకరంగా మారుతోంది. సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులభంగా శరీరంలోకి ప్రవేశించటమే ఈ వేరియంట్‌ ప్రమాదకరంగా మారటానికి కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటిలో పని చేస్తున్న అంటువ్యాధుల నిపుణులు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపారు.

Covid New Variant : కరోనా మళ్లీ విజృంభణ.. కొత్త వేరియంట్‌ కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

2020లో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్‌ బీఏ1 వేరియంట్‌ బారినపడి కోలుకోగా వచ్చిన రోగనిరోధక శక్తి సైతం ఎలాంటి రక్షణ కల్పించదని చెప్పారు. ఇటీవల సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక సైతం బీఏ5 వేరియంట్‌పై హెచ్చరించింది. మూడు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్‌ మళ్లీ సోకుతున్నట్లు పేర్కొంది. రోగనిరోధక శక్తిని రహస్యంగా ఎదుర్కొనే వేరియంట్‌గా లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల పరిశోధకులు పేర్కొన్నారు. గతంలోని వేరియంట్ల కంటే ప్రమాదకరమని, ఈ వేరియంట్‌ను ఇమ్యూన్‌ వ్యవస్థ గుర్తించలేకపోతోందని వివరించారు.