World Bank : శ్రీలంకకు రుణాలిచ్చేది లేదన్న ప్రపంచ బ్యాంకు

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆ దేశంలో తగిన స్థూల ఆర్థిక విధాన కార్యాచరణ అమల్లోకి వచ్చేవరకూ కొత్తగా రుణాలిచ్చే ప్రణాళికేది లేదని ప్రపంచ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరీకరణపై దృష్టి సారించే దిశగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.

World Bank : శ్రీలంకకు రుణాలిచ్చేది లేదన్న ప్రపంచ బ్యాంకు

World Bank Loan

World Bank : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆ దేశంలో తగిన స్థూల ఆర్థిక విధాన కార్యాచరణ అమల్లోకి వచ్చేవరకూ కొత్తగా రుణాలిచ్చే ప్రణాళికేది లేదని ప్రపంచ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరీకరణపై దృష్టి సారించే దిశగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్థిక పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి కోసం.. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన మూల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.

దేశంలో తీవ్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజలపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. మందులు, వంట గ్యాస్‌, ఎరువులు, పాఠశాల పిల్లలకు భోజనం, పేద, బలహీన కుటుంబాలకు నగదు బదిలీ వంటి అవసరాల్లో కొరతను కాస్త తీర్చేలా ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 160 మిలియన్‌ డాలర్ల తోడ్పాటు అందించినట్లు తెలిపింది.

Gotabaya Rajapaksa: గొటబయ రాజపక్స పారిపోలేదు.. శ్రీలంకకు తిరిగి వస్తున్నారట.. ఎప్పుడంటే?

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం కారణంగా అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్లలో ఎదురుచూసి చూసీ జనం ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్‌ గుణవర్థనను నియమించిన రోజే మరో ఇద్దరు క్యూలైన్లలో ఉండి కుప్పకూలారు. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో కిన్నియా పట్టణంలో ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద తన మోటార్‌ సైకిల్‌కు ఇంధనం నింపేందుకు 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజులు పడిగాపులు కాశాడు. నిన్న ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

Sri Lanka: వారంలో ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దాల‌ని శ్రీలంక కొత్త అధ్య‌క్షుడు విక్ర‌మ‌సింఘే నిర్ణ‌యం

అటు మథుగమ ప్రాంతంలో పెట్రోల్‌ బంకు వద్ద క్యూ లైన్‌లో నిలబడి మరో వృద్ధుడు కుప్పకూలిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇంధనం పొందడానికి జనం క్యూలైన్లలో వేచి చూసి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. 2022 ఆరంభం నుంచే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో నిలబడుతున్న క్రమంలో తీవ్రమైన వేడిని తట్టుకోలేక అలిసిపోయి కొందరు ప్రాణాలు విడిచారు.