Donald Trump: 2024 ఎన్నికల్లో నన్ను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుంది ..

2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం విధితమే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి నిరసనగా వైట్ హౌస్‌లో ట్రంప్ అనుకూల వర్గం సమావేశమై పార్లమెంట్ భవనాన్ని ధ్వంసంచేసినట్లు, ఇందుకు ట్రంప్ ప్రోత్సాహమే కారణమని ఆరోపణ‌లు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన కమిటీ కాపిటల్ భవనంపై హింసకు ట్రంప్ బాధ్యుడని, ఈ క్రమంలో ట్రంప్ ను ప్రాసిక్యూట్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

Donald Trump: 2024 ఎన్నికల్లో నన్ను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుంది ..

Donald Trump

Donald Trump: తనను మళ్లీ వైట్‌హౌస్‌కు పోటీ చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగానే తప్పుడు అభియోగాలను సిఫార్సు చేశారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. క్యాపిటల్ భవనం హింసపై విచారణ జరుపుతున్న కమిటీ ట్రంప్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను సిఫార్సు చేసింది. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవటం, యునైటెడ్ స్టేట్స్‌కు ద్రోహం చేయడం, తిరుగుబాటు దారులకు సహాయం చేయడం వంటివి ట్రంప్‌పై కమిటీ ఉదహరించిన నేరాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ను ప్రాసిక్యూట్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

Donald Trump: 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ట్రంప్

2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం విధితమే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి నిరసనగా వైట్ హౌస్‌లో ట్రంప్ అనుకూల వర్గం సమావేశమై పార్లమెంట్ భవనాన్ని ధ్వంసంచేసినట్లు ఆరోపణ లు ఉన్నాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయపడ్డారు. నలుగురు కాపిటల్ పోలీసు అధికారులు కూడా మరణించారు. అయితే, వీరిని మాజీ అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Donald Trump: మస్క్‌కు షాకిచ్చిన ట్రంప్.. ట్విటర్‌లో రీ ఎంట్రీకి నిరాకరణ.. అసలు కారణం ఏమిటంటే?

కాపిటల్ భవనంపై హింసకు ట్రంప్ బాధ్యుడని దర్యాప్తు కమిటీ సిఫార్సు చేసింది. ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ట్రంప్ యోచనకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కమిటీ ప్రతినిధి జామీ రాస్కిన్ మాట్లాడుతూ.. ట్రంప్ పై క్రిమినల్ అభియోగాలు మోపడానికి మా విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయని మేము నమ్ముతున్నామన్ని అన్నారు. కమిటీ సిఫారసుపై ట్రంప్ స్పందిస్తూ.. ఈ వ్యవహారమంతా ఫేక్ , తనపై కుట్ర జరిగిందని అన్నారు. కమిటీ తప్పుడు, పక్షపాత నివేదికను ఇచ్చిందని అన్నారు. నేను ఎప్పుడూ గెలిచాను, చివరికి నేనే గెలుస్తాను అన్నారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నన్ను పోటీ చేయకుండా నిరోధించేందుకు కుట్రలో భాగమే కమిటీ తప్పుడు సిఫారసు అని ట్రంప్ అన్నారు.