Cars worth Rs.7 Crore Stolen : 60 సెకన్లలో రూ.7కోట్ల విలువైన కార్లు చోరీ..!

కేవలం 60 సెకన్లు అంటే ఒకే ఒక్క నిమిషంలో రూ.7కోట్ల విలువ చేసే కార్లను ఎత్తుకుపోయారు దొంగలు.

Cars worth Rs.7 Crore Stolen : 60 సెకన్లలో రూ.7కోట్ల విలువైన కార్లు చోరీ..!

Cars worth Rs.70 Crore Stolen

Cars worth Rs.7 Crore Stolen : చోరీలు చాలానే జరగుతుంటాయి. వెండి బంగారు నగలు,డబ్బు, బైకులు, కార్లు ఇలా చోరీలు జరుగుతుంటాయి. చోరీ చేయాలంటే ఓ ప్లాన్ వేసుకుంటారు దొంగలు. దానికోసం వేచి చూస్తారు. కానీ ఓ చోట మాత్రం ఏకంగా రూ.7కోట్ల విలువైన కార్లను కేవలం 60 సెకన్లలో చోరీ చేశారు కేటుగాళ్లు. ఈ చోరీ చూస్తే షాక్ అవ్వాల్సిందే. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అనుకున్నారో ఏమో గానీ ఈ దొంగలు మామూలోళ్లు కాదు.

కేవలం 60 సెకన్లు అంటే ఒకే ఒక్క నిమిషంలో రూ.7కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లను ఎత్తుకుపోయిన ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఈ చోరీ చూస్తే వావ్ హైటెక్ దోపిడీ అని తీరాల్సిందే..64 కళల్లో దొంగతనం కూడా ఓ కళేనంటారు. దొంగతనం అనేది చేస్తే మూడోకంటికి కూడా చేస్తే మూడోకంటికి కూడా తెలియకూడదంటారు. అటువంటి చోరీయే ఈ లగ్జరీ కార్ల చోరీ.

కొద్దిరోజుల కిందట ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీ బ్రెంట్‌వుడ్ రోడ్ సమీపంలోని ఓ ఇండస్ట్రియల్ యూనిట్‌‌లో కొందరు దొంగలు చొరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను చాకచక్యంగా చాలా ఈజీగా ఎత్తుకుపోయారు. ఆ వచ్చినవారు పక్కా ప్లాన్ తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ చోరీ వీడియో చూస్తే..ఒక వ్యక్తి గేటు ఓపెన్ చేయగా.. మిగిలినవాళ్లు ఎంచక్కా ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ కేవలం 60 సెకన్లలోనే అక్కడ నుంచి ఉడాయించారు.

ఈ చోరీకి కేవలం 60సెకన్లు పట్టింది వారికి. ఆ దొంగలు ఎత్తుకెళ్ళిన లగ్జరీ కార్ల విలువ సుమారు రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా. వాటిల్లో రెండు పోర్ష్, మెర్సిడెస్.. అలాగే ఒక మేబ్యాక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈచోరీపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసిన దొంగలు దొరుకుతారా? లేదా పోలీసులకు కూడా బురిడి కొట్టాస్తారో వేచి చూడాలి..