Taliban : తాలిబన్ అగ్రనేత‌.. శిక్షణ పొందింది ఇండియన్ మిలటరీ అకాడమీలోనే

అతడు ఒక‌ప్పుడు మన దేశంలోని డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందాడు. 1982లో అఫ్ఘాన్ సైన్యం త‌ర‌పున ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు

Taliban : తాలిబన్ అగ్రనేత‌.. శిక్షణ పొందింది ఇండియన్ మిలటరీ అకాడమీలోనే

Taliban Leader Sher Mohammad Abbas Stanikzai

Taliban Top Leader : అతడు ఒక‌ప్పుడు మన దేశంలోని డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందాడు. 1982లో అఫ్ఘాన్ సైన్యం త‌ర‌పున ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు అత‌ని బ్యాచ్‌మేట్స్ షేరూ అని పిలిచేవారు. కట్ చేస్తే.. ఇప్పుడతను తాలిబన్ల అగ్రనేత అయ్యాడు. తాలిబ‌న్ల ఉగ్ర సంస్థ‌ను న‌డిపిస్తున్న ఏడుగురు కీలక వ్యక్తుల్లో అతడూ ఒక‌డు. అతడే షేర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్.

ఇండియాలో సైనిక శిక్ష‌ణ పొందిన అబ్బాస్ గురించి అత‌ని బ్యాచ్‌మేట్స్ ఆసక్తిక‌ర విష‌యాలు చెప్పారు. స్టానిక్‌జాయ్ శారీర‌కంగా దృఢంగా ఉండేవాడ‌ని, మ‌త‌ప‌ర‌మైన భావాలు ఎక్కువ‌గా ఉండేవి కావ‌ని అన్నారు. 20 ఏళ్ల వ‌య‌సులో అత‌ను శిక్ష‌ణ కోసం వ‌చ్చాడ‌ని, అత‌నితో పాటు 45 మంది విదేశీయులు ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో ట్రైనింగ్ తీసుకున్న‌ాడన్నారు.

అకాడ‌మీలో షేరూ కొంత వ‌య‌సు ఎక్కువ ఉన్న వ్య‌క్తిగా క‌న‌బ‌డేవాడు, మీసాల‌తో అట్రాక్ట్ చేసేవాడ‌ని, ఆ స‌మ‌యంలో అత‌నికి విప్ల‌వ భావాలు లేవ‌ని, అత‌నో స‌గ‌టు అఫ్ఘాన్ క్యాడెట్ అని ఆనాటి బ్యాచ్‌మేట్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఏడీ చ‌తుర్వేది తెలిపారు. షేరూతో బ్యాచ్‌మేట్‌గా ఉన్న క‌ల్న‌ల్ కీస‌ర్ సింగ్ షెకావ‌త్ కూడా ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. డెహ్రాడూన్‌లో ప్ర‌తి వారం చివ‌ర‌ల్లో న‌ది ప్రాంతానికి ట్రిప్‌కు వెళ్లేవాళ్ల‌మ‌ని క‌ల్న‌ల్ కీస‌ర్ తెలిపారు. అబ్బాస్‌తో క‌లిసి రిషికేశ్‌కు వెళ్లి గంగా న‌దిలో స్నానం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

1996లో అబ్బాస్ స్టానిక్‌జాయ్.. అఫ్ఘానిస్తాన్ ఆర్మీకి గుడ్‌బై చెప్పాడు. ఆ త‌ర్వాత తాలిబ‌న్‌లో చేరాడు. తాలిబ‌న్ల‌కు దౌత్య‌ప‌ర‌మైన హోదా ఇవ్వాలంటూ వాషింగ్ట‌న్‌కు వెళ్లి క్లింట‌న్‌ను వేడుకున్నాడు. కానీ అత‌ని ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అఫ్ఘాన్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ అబ్దుల్ హ‌కిమ్ హ‌క్కానీ గ్రూపుకు మ‌ధ్య‌వ‌ర్తిగా కూడా చేశాడు. షేరూకు ఇంగ్లీష్ పై మంచి ప‌ట్టుంది. మిలిట‌రీ శిక్ష‌ణ‌లోనూ అత‌ను ఆరితేరిపోయాడు. ఆ అనుభవంతోనే అత‌ను ఇప్పుడు తాలిబ‌న్ల‌లో కీల‌క స‌భ్యుడిగా ఎదిగాడు. 2015లో ఖ‌తార్‌లోని తాలిబ‌న్ పొలిటిక‌ల్ ఆఫీస్ అధిప‌తిగా నియ‌మితుయ్యాడు.

తాలిబన్ల పాలనలో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ గా పని చేశాడు. ఇండియన్ మిలటరీ అకాడెమీలో శిక్షణ కోసం వచ్చినప్పుడు అబ్బాస్ వయసు 20. అబ్బాస్ 1963లో లోగర్ ప్రావిన్స్ లోని బారాకీ బరాక్ జిల్లాలో జన్మించాడు. ఇండియన్ మిలిటరీ అకాడెమీలో ఏడాదిరన్న పాటు ప్రీ కమిషన్ శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత అఫ్ఘాన్ నేషనల్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా జాయిన్ అయ్యారు. అప్పుడు అప్ఘానిస్తాన్ ను సోవియట్ యూనియర్ రన్ చేసింది. 1980లో సోవియట్ ఆర్మీకి వ్యతిరేకంగా అబ్బాస్ అఫ్ఘాన్ ఆర్మీని వదిలి జిహాద్ లో జాయిన్ అయ్యాడు. 1996లో ఆర్మీని వదిలి తాలబన్ లో చేరాడు. కాగా, అబ్బాస్ ఇండియాలో శిక్షణ పొందిన కారణంగా.. దేశ విదేశాంగ శాఖకు అతడు ట్రంప్ కార్డు అవ్వొచ్చని, అతడితో మాట్లాడి తాలిబన్లతో భారత్ చర్చలు జరిపేందుకు మార్గం ఏర్పాటు చేసుకోవచ్చని అబ్బాస్ బ్యాచ్ మేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడు అప్ఘానిస్తాన్ లో ఏర్పాటు తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో అబ్బాస్ కీలక పాత్ర పోషించనున్నాడు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కొత్త అధ్యక్షుడు కానున్నాడు.