Forbes 30 Under 30 Asia 2024 : ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితా 9వ ఎడిషన్.. భారతీయ యువ పారిశ్రామికవేత్తలు వీరే..

ప్రపంచవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘30 అండర్ 30 ఆసియా’ జాబితా 9వ ఎడిషన్‌ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో 300 మంది యువ పారిశ్రామికవేత్తలను గుర్తించగా అందరూ 30 ఏళ్లలోపు వారే ఉన్నారు.

Forbes 30 Under 30 Asia 2024 : ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితా 9వ ఎడిషన్.. భారతీయ యువ పారిశ్రామికవేత్తలు వీరే..

Forbes 30 Under 30 Asia 2024 : Indian Entrepreneurs ( Image Credit : Google )

Forbes 30 Under 30 Asia 2024 : ప్రముఖ గ్లోబల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘30 అండర్ 30 ఆసియా’ జాబితా 9వ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫోర్బ్స్ 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, 30 ఏళ్లలోపు అసాధారణ వ్యక్తులను గుర్తించింది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పరిశ్రమలను నెలకొల్పినవారు పారిశ్రామికవేత్తలు, నాయకులు, ట్రయల్‌బ్లేజర్‌లు ఉన్నారు. వీరిందరి వయస్సు 30 ఏళ్లలోపు మాత్రమే. ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమలను నెలకొల్పడం వరకు సాంకేతికత, సుస్థిరత నుంచి లాజిస్టిక్స్ ఫ్యాషన్ వరకు విభిన్న రంగాలకు చెందిన పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.

ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో భారతీయులు :
ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ కేటగిరి : ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ విభాగంలో భారతీయ యువ పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా నిలిచారు. ఈ జాబితాలో చేరిన వారిలో భారత్ నుంచి అనేక మంది ఆవిష్కర్తలు ఉన్నారు.

కునాల్ అగర్వాల్ : క్రెడ్‌ఫ్లో ఇండియా వ్యవస్థాపకుడు
27 ఏళ్ల కునాల్ అగర్వాల్.. 2019లో క్యాష్‌ఫ్లో మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి క్రేడ్‌ఫ్లో అనే వెంచర్‌ను ప్రారంభించారు. మొత్తం సుమారు 9 మిలియన్ల డాలర్ల నిధులతో క్రేడ్ ఫ్లో మరింత వృద్ధి సాధించనుంది.

ముకుల్ ఆనంద్ – రెహుక్.ఏఐఇండియా సహ వ్యవస్థాపకుడు
26 ఏళ్ల ముకుల్ ఆనంద్.. కస్టమర్ ప్రమోషన్ క్యాంపెయిన్‌ల కోసం ఏఐ టెక్నాలజీతో బెంగళూరు ఆధారిత స్టార్టప్‌ను ప్రారంభించారు. ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు సంపాదించిన (Rehook.ai) 2022లో ప్రీ-సీడ్ ఫండింగ్‌లో దాదాపు 2 మిలియన్ డాలర్లను పొందింది.

గౌరవ్ పీయూష్, మయాంక్ వర్ష్నీ, యష్ శర్మ – బ్లిట్జ్ ఇండియా సహ వ్యవస్థాపకులు :
ఈ బ్లిట్జ్ ఇండియా కంపెనీని గౌరవ్ పీయూష్, మయాంక్ వర్ష్నీ, యష్ శర్మ ముగ్గురు కలిసి స్థాపించారు. ఈ ముగ్గురి జాయింట్ వెంచర్ లాజిస్టిక్‌లను అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ సేవలు అందిస్తున్నారు. అంతకుముందు గురుగ్రామ్ ఆధారిత స్టార్టప్‌గా దీన్ని పిలిచేవారు. గత ఏడాది సీడ్ ఫండింగ్‌లో 3 మిలియన్ డాలర్లను సేకరించింది.

ఆదిత్య దాడియా – ఆల్‌రైట్‌ ఇండియా వ్యవస్థాపకుడు :
2022లో స్థాపించిన ఆల్‌రైట్‌ఇండియా భారత్ బీమా రంగానికి డిజిటల్ పరిష్కారాలను అందించింది. ఏంజెల్ ఫండింగ్‌లో 1 మిలియన్ డాలర్లకు పైగా పొందింది.

ఆర్యన్ శర్మ, ఆయుష్ పాఠక్ – ఇండస్డ్ ఇండియా సహ వ్యవస్థాపకులు :
2023లో 2.3 మిలియన్ డాలర్ల నిధులతో వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా వీరిద్దరూ ఇండస్ట్ ఇండియాను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రోబోట్‌లకు బ్యాక్-ఆఫీస్ టాస్క్‌లను టీచింగ్ చేయడంపై దృష్టి సారిస్తుంది. తద్వారా ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో ఈ కంపెనీ చోటు దక్కించుకుంది.

అదితి సిన్హా, రిషబ్ జైన్ – (Locale.aiIndia) సహ వ్యవస్థాపకులు :
2019లో ప్రారంభమైన లోకాలే ఏఐ బెటర్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల మద్దతుతో తక్కువ ఇన్వెంటరీ స్థాయిల వంటి సమస్యలను పరిష్కరించేందుకు వర్క్‌ఫ్లో మేనేజ్‌మెంట్‌ను క్రమబద్ధీకరించడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి డేటాను ఏకీకృతం చేస్తుంది.

హర్షిత్ మిట్టల్ – సప్లైనోట్ ఇండియా కోఫౌండర్ :
భారత రెస్టారెంట్ పరిశ్రమలో సప్లైనోట్ అనే కంపెనీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. ఆర్టీసియన్, వెంచర్ క్యాటలిస్ట్‌లతో సహా పెట్టుబడిదారుల మద్దతుతో 5 మిలియన్ డాలర్ల నిధులను పొందింది.

ఈషా మణిదీప్ దిన్నె, వరుణ్ వుమ్మడి – (GigaMLindia) సహ వ్యవస్థాపకులు :
2023లో స్థాపించిన గిగాఎమ్‌ల్ వినూత్న ప్లాట్‌ఫారమ్ ద్వారా లార్జ్ లాంగ్వేజీ మోడల్స్ రన్ చేయడంలో కంపెనీలకు 3.6 మిలియన్ డాలర్ల మొత్తం నిధులతో సాయం చేస్తుంది.

అంకిత్ బన్సాల్, ఇషాన్ రక్షిత్, ప్రియ రంజన్ – షాప్‌ఫ్లో ఇండియా సహ వ్యవస్థాపకులు :
2021లో స్థాపించిన షాప్‌ఫ్లో 3.7 డాలర్ల నిధులతో భారత చిన్న ఇ-కామర్స్ బ్రాండ్‌లకు చెక్అవుట్ సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేకత కలిగి ఉంది.

స్మార్ట్‌వీర్ సిదానా – (HireQuotientIndia) వ్యవస్థాపకుడు :
దాదాపు 3 మిలియన్ డాలర్ల నిధులతో సింగపూర్ ఆధారిత స్టార్టప్ (HireQuotient) ఏఐ-ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియలతో హ్యుమన్ రీసోర్సెస్‌ను విప్లవాత్మకంగా మారుస్తోంది.

Read Also : Indian Businessman : కొడుకు 18వ పుట్టినరోజుకి తండ్రి కాస్ట్‌‌లీ గిఫ్ట్.. రూ.5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారు.. వీడియో వైరల్!