Viral Video : సిగరేట్ తాగుతుండగా..కూలిన భారీ వృక్షం, తర్వాత

పబ్ ఓనర్ ఒక్క క్షణం అడుగు ముందుకేసి ఉంటే..గాలిలో ఆమె ప్రాణాలు కలిసిపోయేవి. సిగరేట్ ఆమె ప్రాణాలు కాపాడిందంటున్నారు.

Viral Video : సిగరేట్ తాగుతుండగా..కూలిన భారీ వృక్షం, తర్వాత

Tree

Tree Collapses : ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ప్రమాదం ఎటునుంచి వస్తుందో అర్థం కాదు. ఒక్క క్షణంలో ప్రాణాలు నిలిచిన ఘటనలు వెలుగు చూస్తుంటాం. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా…ఓ పబ్ ఓనర్ ఒక్క క్షణం అడుగు ముందుకేసి ఉంటే..గాలిలో ఆమె ప్రాణాలు కలిసిపోయేవి. సిగరేట్ ఆమె ప్రాణాలు కాపాడిందంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన యూకే లో చోటు చేసుకుంది.

Read More : Ramagundam : సినిమా చూసి మర్డర్..రామగుండం మీ సేవ ఉద్యోగి హత్య

ఓ మహిళ పబ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. పబ్ లో అలసిపోవడంతో..బయటకు వచ్చి రిలాక్స్ గా సిగరేట్ తాగుదామని బయటకు వచ్చింది. అనంతరం ఓ చోట నిలబడి..సిగరేట్ తాగుతోంది. అనంతరం సిగరేట్ అయిపోగానే..ముందుకు వెళుదామని అనుకుంది. అక్కడ ఓ వస్తువును పట్టుకుని..ముందుకెళ్లబోయింది. అంతే..అక్కడనే ఉన్న ఓ భారీ చెట్టు కూలిపోయింది. ఏమి అయ్యిందో అర్థం కాలేదు. సిగరేట్ తాగడం…ఒక్క క్షణం ముందు అయిపోతే…దారుణం జరిగేది అనుకుంటున్నారు. అనంతరం చెట్టు కొమ్మలను దాటుకుంటూ…ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.