Twitter సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఇండియన్.. సూపర్ టాలెంటెడ్ Rinki Sethi

Twitter సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఇండియన్.. సూపర్ టాలెంటెడ్ Rinki Sethi

డిజిటల్‌ ప్రపంచంలో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు మహిళల్నే చీఫ్‌లుగా ఎంపిక చేసుకుంటున్నాయి. కీలకమైన విషయాలను బయటికి పొక్కనివ్వకుండా కాపాడటంలో మహిళలే పురుషులకన్నా సమర్థులని, విశ్వసనీయులని మల్టీనేషనల్‌ సంస్థలు భావిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా జెయింట్‌ అయిన ‘Twitter’ తన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉండేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్న భారతీయురాలు Rinki Sethi పిలుపునిచ్చింది.

Rinki Sethiని తీసుకుంటున్నట్లు ట్విట్టర్‌ ఎంతో ఉత్తేజపూర్వకంగా ప్రకటించింది. హ్యాకర్‌ల కళ్లన్నీ పాస్‌వర్డ్‌ల కోసం వేటాడుతుంటే.. ట్విట్టర్‌ వంటి దిగ్గజ కంపెనీకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉండటం వేరు. గతంలో రింకీ.. IBM ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌గా, కాలిఫోర్నియాలోని కంప్యూటర్‌ స్టోరేజ్‌ కంపెనీ ‘రూబ్రిక్‌’లో సీనియర్‌ ఆఫీసర్‌గా పని చేశారు.



‘రింకీ మా ఇన్‌ఫో సెక్షన్‌ టీమ్‌ని లీడ్‌ చేస్తారు. మా కస్టమర్‌ల డేటాకు, వ్యక్తిగత సమాచారానికి పూర్తి స్థాయిలో రక్షణగా ఉంటారు’ అని ఆమె సామర్థ్యాల పట్ల నమ్మకాన్ని తెలియపరిచింది. ట్విట్టర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ మైక్ కన్వర్టినో 2019 డిసెంబర్‌ లో తప్పుకున్న తర్వా త ఆ స్థానం భర్తీ చేయడానికి ఇన్నాళ్లు పట్టింది.

గతంలో రింకీ.. IBM, Rubrikలకు మాత్రమే కాకుండా.. ఫార్చూన్‌ 500 కంపెనీలైన పాలో ఆల్టో నెట్‌వర్క్స్, పీజీ అండ్‌ ఈ, వాల్‌మార్ట్‌ డాట్‌ కామ్, ఈబే సంస్థల కోసం కూడా గతంలో వినూత్నమైన ఆన్‌లైన్‌ సెక్యూరిటీ విధాలను అభివృద్ధిపరచి ఇచ్చారు రింకీ. 2010లో ప్రతిష్టాత్మకమైన ‘సీఎస్‌ఓ మ్యాగజీన్‌ అండ్‌ ఎగ్జికూటివ్‌ ఉమెన్స్‌ ఫోరమ్‌’ రింకీని ‘వన్‌ టు వాచ్‌’ అవార్డుతో సత్కరించింది.



ఉత్తర అమెరికాలోని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ‘సెక్యూర్‌ వరల్డ్‌’ సలహా మండలిలో కూడా రింకీ సభ్యురాలిగా ఉండి వచ్చారు. కాపెల్లా, స్టాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఇష్టమైన పూర్వపు విద్యార్థులలో రింకీ సేథీ కూడా ఒకరు.

జులై నెలలో కంపెనీ సైబర్ అటాక్ కు గురై ఇంటర్నల్ అడ్మిన్ టూల్స్ అన్నింటిపైనా ఎఫెక్ట్ చూపించింది. రియల్ టైంలో సోషల్ మీడియాను.. హై ప్రొఫైల్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లన్నింటినీ హైజాక్ చేశారు హ్యాకర్లు. క్రిప్టోకరెన్సీ స్కాంను వ్యాప్తి చేశారు. హ్యాకర్లు వాయీస్ ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్ లు వాడి ఫోన్ నుంచి పాస్ వర్డ్ లు కొట్టేయడానికి ఇంటర్నల్ సిస్టమ్స్ మీద అటాక్ చేశారు.