Fighter Planes Collide: ఎయిర్ షో సమయంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్

టెక్సాస్‌లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ఎయిర్ షో జరిగింది. ఈ ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. వెంటనే నేలపై పడి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు తెలిస్తోంది

Fighter Planes Collide: ఎయిర్ షో సమయంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్

Fighter Planes Collide

Fighter Planes Collide: టెక్సాస్‌లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ఎయిర్ షో జరిగింది. ఈ ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు (బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్‌కోబ్రా) ఢీకొన్నాయి. వెంటనే నేలపై పడి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు తెలిస్తోంది. నివేదికల ప్రకారం.. రెండు విమానాల్లోని పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 12గంటల సమయంలో చోటు చేసుకుంది.

ఈ ఎయిర్ షో ప్రదర్శనను తిలకించేందుకు 4వేల నుంచి 6వేల మంది సందర్శకులు ప్రమాద సమయంలో అక్కడే ఉన్నారు. రెండు విమానాలు ఢీకొన్న ఘటనకు సంబంధిం చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటన సమయంలో నేలపై పడిపోయిన శిథిలాలు విమానాశ్రయం దక్షిణంవైపు నుండి హైవే-67 మీదుగా ఎదురుగా ఉన్న స్ట్రిప్ మాల్ వరకు పడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన రెండు విమానాలు పాతకాలపు (రెండవ ప్రపంచ యుద్ధం) సైనిక విమానాలుగా పేర్కొంటున్నారు. ఎయిర్ షో సమయంలో ఒక బోయింగ్ B-17 గాలిలో విన్యాసాలు చేస్తోంది, అకస్మాత్తుగా బెల్ P-63 అనే మరో విమానం ఈ విమానం సమీపంలోకి వచ్చింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకముందే రెండు విమానాలు ఢీ కొన్నాయి. రెండు విమానాలు ముక్కలుగా విడిపోయి భూమిపై పడుతుండటంతో వీడియోలో చూడొచ్చు.

రెండు యుద్ధ విమానాలు ఢీకొని నేలకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 40కి‌పైగా అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. శిథిలాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాయి. రెండు విమానాల్లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి.