Pakistan Terror: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కుల దారుణ హత్య
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా పోలీసులు గుర్తించారు.

Pakistan Terror: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్‌లో బడా బజార్‌లో ఈ ఇద్దరు సిక్కులు చాలా కాలంగా దుకాణం నడుపుతున్నారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా పోలీసులు గుర్తించారు. దుకాణంలో కూర్చుని వీరిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలేవి అంతుబట్టలేకుండా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
Other Stories:MP Navneet Rana: అధికార దుర్వినియోగానికి పాల్పడి మాపై దేశద్రోహం కేసు: ఉద్ధవ్ థాకరేపై ఎంపీ నవనీత్ ఫైర్
ఇద్దరు సిక్కుల హత్య అనంతరం పెషావర్ లో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ స్థానిక పోలీసులను ఆదేశించారు. ఇద్దరు సిక్కుల హత్య బాధాకరమని, హంతకులను వదిలిపెట్టబోమని ఖాన్ అన్నారు. కాగా పాకిస్తాన్ లో ఉన్న సిక్కులపై గత కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ నేత మంజిందర్ సిర్సా అన్నారు. పెషావర్‌ను విడిచిపెట్టమని పాకిస్తాన్‌లోని సిక్కులను బెదిరిస్తున్నారని, ఈవిషయాన్ని పలుమార్లు పాకిస్థాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సిర్సా ఆవేదన వ్యక్తం చేశారు.
Other Stories: Vladimir Putin: పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్.. వెల్లడించిన ఓలిగర్
పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న సిక్కుల హక్కులను అక్కడి ప్రభుత్వం కాలరాస్తోందని సిర్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని హైకమిషన్‌ను సంప్రదించాలని.. భారత్ లోని పాకిస్థాన్ రాయబారిని కూడా పిలిపించి వివరణ కోరాలని మంజిందర్ సిర్సా డిమాండ్ చేశారు.
- Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
- Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
- Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి
- Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!
- Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం
1Deepthi Sunaina : అర్ధరాత్రి చీకట్లో.. మిరుమిట్లు గొలిపే వెలుగుల్లో.. చీరలో మెరిసిపోతున్న దీప్తి సునైనా
2Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
3Konaseema Tension : అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పెట్టింది : జీవీఎల్
4చంద్రబాబు, పవన్ వల్లే అలజడులు..!
5అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్
6మంటల్లో కాలిపోయిన బుల్లెట్లు
7PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..
8కోనసీమలో భారీగా అదనపు బలగాల మోహరింపు
9అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
10అమలాపురంలో టెన్షన్… అటెన్షన్…!
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
-
Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
-
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
-
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్