Rishi Sunak : లేఖ లీక్..బ్రిటన్ ఆర్థికమంత్రి పదవి నుంచి రిషి సునక్ తొలగింపు?

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునక్ ని డీమోట్ చేస్తానని ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించినట్లు సమాచారం.

Rishi Sunak : లేఖ లీక్..బ్రిటన్ ఆర్థికమంత్రి పదవి నుంచి రిషి సునక్ తొలగింపు?

Boris

Rishi Sunak భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునక్ ని డీమోట్ చేస్తానని ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించినట్లు సమాచారం. రిషి సునక్ ని..ఆర్థికశాఖ నుంచి తప్పించి..ఆరోగ్య శాఖ అప్పగించాలని బోరిస్ జాన్సన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గత వారం మీడియాకు లీక్ అయిన ఓ లేఖ దీనింతటికి కారణమని తెలుస్తోంది.

గత ఆదివారం ప్రణాళికాబద్ధమైన సమీక్షకు ముందు.. అంతర్జాతీయ కోవిడ్ -19 ప్రయాణ నిబంధనలను సడలించాలని పేర్కొంటూ రిషి సునక్ బోరిస్ జాన్సన్ కి ఓ లేఖ రాశారు. ప్రయాణ ఆంక్షలను గణనీయంగా సడలించాలని, అవి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని బోరిస్ కి రాసిన లేఖలో ఆర్థిక మంత్రి రిషి సునక్ హెచ్చరించారు. అయితే ఈ లేఖలోని వివరాలు జాన్సన్ కి తెలిసేలోపే మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో మీడియాలో లేఖ విషయం గురించి తెలుసుకున్న బోరిస్ జాన్సన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో రివ్యూ మీటింగ్ లో అధికారుల ముందే కోపంతో ఊగిపోయిన జాన్సన్..రిషి సునక్ ని శక్తివంతమైన ఆర్థికశాఖ నుండి తొలగించాలని ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించినట్లు సమాచారం. రిషిని తదుపరి రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా చూసే సమయం వచ్చిందని.. అతను అక్కడ చాలా మంచి ఉద్యోగం చేయగలడు అని సమావేశంలో ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నట్లు సమాచారం. తదుపరి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోరిషి సునక్ ని ఆర్థికశాఖ నుంచి తొలగించనున్నట్లు బోరిస్ జాన్సన్ సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, కరోనా దృష్ట్యా భారత్​ పై విధించిన ప్రయాణ ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది. తాము ఆమోదించిన కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారు తమ దేశానికి రావొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. తమ ప్రభుత్వం ఆమోదించిన భారతీయ వ్యాక్సిన్​లో కొవిషీల్డ్​ ఉందని బోరిస్ సర్కార్ పేర్కొంది. దీంతో భారత్ ​నుంచి వెళ్లిన ప్రయాణికులు రెండు డోసులు తీసుకున్నట్లైతే.. యూకే వెళ్లిన తర్వాత హోటల్​ క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి ఇళ్లలోనే ఉండాలని యూకే ప్రభుత్వం సూచించింది. అంతేగాక ప్రయాణికులు యూకేలో ఎక్కడ ఉంటున్నారనే ఫారాన్ని పక్కాగా పూర్తి చేసి వెళ్లాలని స్పష్టం చేసింది.