Baldness : బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసిన బాస్ .. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి

బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసాడు బాస్..దీంతో సదరు ఉద్యోగి ఆ కంపెనీకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

Baldness : బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసిన బాస్ .. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి

UK Sales Director..Fired For Being Bald

Baldness : మగవారికి అతి పెద్ద సమస్య ‘బట్టతల’(Baldness).. తలపై గుబురుగా వెంట్రుకలుంటే ఈ ప్రపంచాన్నే జయించేసినంత సంతోషం. కానీ ఒక్కో వెంట్రుక రాలుతుంటే ఏదో కోల్పోతున్న భావన మగవారిలో ఉంటుంది. వయస్సుపైబడినట్లుగా కనిపిస్తామని ‘బట్టతల’తో బాధపడిపోతుంటారు. మధనపడిపోతుంటారు. పెళ్లికాకుండానే ‘బట్టతల’ వస్తే పెళ్లి కాదేమోనని బెంగ. పక్క ఫ్రెండ్‌కు తలనిండా గుబురుగా వెంట్రుకలుంటే తమ తలను తడుముకుని బాధపడిపోతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ‘బట్టతల’మగవారికి పెద్ద సమస్యగా తయారైంది. ‘బట్టతల’ ఉంటే పెళ్లికాదేమోనని బెంగపడటం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ‘బట్టతల’ ఉంటే ఉద్యోగం (Job) రాదా? ఉన్న ఉద్యోగం పోతుందా? అంటే ఉద్యోగానికి ‘బట్టతల’కు సంబంధమేంటీ? అని అనుకోవచ్చు. కానీ ఓ ఉద్యోగికి ‘బట్టతల’ పెద్ద సమస్యగా మారి ఉద్యోగం కాస్తా ఊడింది. తన వద్ద పనిచేసే ఉద్యోగికి ‘బట్టతల’ ఉందని ఉద్యోగం నుంచి తీసేసాడు ఓ బాస్ (Boss)..మరి ఇప్పుడైనా నమ్ముతారా? ‘బట్టతల’ ఎంత పనిచేసింది? అని….!!

ఇంగ్లాండ్‌ కు చెందిన 61 ఏళ్ల మార్క్‌ జోన్స్ (Mark Jones)‌..కు అనే వ్యక్తి లీడ్స్‌లోని టాంగో నెట్‌వర్క్‌ అనే మొబైల్‌ ఫోన్ల సంస్థలో సేల్స్‌ డైరెక్టర్‌ (Sales Director)గా పనిచేస్తున్నారు.మార్క్ జోన్స్ కు బట్టతల (Baldness) ఉంది. కానీ అతను చేసే పనికి అతనికి ఉన్న బట్టతలకు ఎటువంటి సంబంధం లేదు. కానీ బాస్ ఫిలిప్‌ హెస్కెట్‌ మాత్రం మార్క్ జోన్స్‌కు బట్టతల ఉందని కారణంతో జాబ్ నుంచి తీసేసాడు. దీంతో జోన్స్ షాక్ అయ్యాడు. అదే విషయాన్ని బాస్‌ను ప్రశ్నించాడు. దానికి  అతని బాస్ ఫిలిట్  సేల్స్‌ టీమ్‌లో యువకులు, చురుకైన వ్యక్తులు కావాలని 50ఏళ్లు దాటి బట్టతల (Baldness) ఉన్న ఉద్యోగులు తన టీమ్‌లో ఉండకూదని భావించానని చెప్పాడు.

కానీ ఇది అన్యాయం బట్టతలకు నేను చేసే పనికి ఏంటీ సంబంధం? అని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. బాస్ చేసిన పనికి మండిపోయింది జోన్స్‌కు. అంతేకాదు నాకు జరిగింది అన్యాయమే కాదు అవమానం కూడా అని భావించిన జోన్స్ మొబైల్‌ తయారీ కంపెనీపై పిటీషన్ వేశాడు కోర్టులో..నన్ను అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసివేయటానికి నా బట్టతలను సాకుగా చూపించారని నాకు జరిగిన ఈ అన్యాయానికి న్యాయం చేయాలని పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు జోన్స్.

దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టు.. జోన్స్‌కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తూ.. టాంగో నెట్‌వర్క్‌.. జోన్స్‌ను సరైన కారణం లేకుండా వివక్ష చూపిస్తూ ఉద్యోగం నుంచి తొలగించిందని..కాబట్టి జోన్స్ కు 71వేల పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.71లక్షలు) నష్టపరిహారం ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై జోన్స్ హర్షం వ్యక్తంచేయగా సరదు కంపెనీ మాత్రం షాక్ అయ్యింది. దీంతో సదరు కంపెనీ జోన్స్ కు కోర్టు ఆదేశించిన మొత్తాన్ని ఇచ్చుకోవాల్చి వచ్చింది. ఇక్కడ అంతకంటే ముఖ్య విషయం ఏమిటంటే..జోన్స్ ను ఉద్యోగం నుంచి తీసివేసిన బాస్ ఫిలిప్‌కు కూడా ‘బట్టతల’ ఉండటం..!! భలే ఉంది కదూ..బట్టతలను అడ్డం పెట్టుకుని బట్టతల ఉన్న బాస్ కు కోర్టు ఇచ్చిన ఝలక్..!!