SHOCKING News : భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా మాననంటోంది..

భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా తినటం మానలేనని..అంటోంది. ఎందుకంటే..నా భర్త అంటే నాకు చచ్చేంత ఇష్టమంటోంది.

SHOCKING News : భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా మాననంటోంది..

Woman Eats Her Dead Husband Ashes

Woman Eats Her Dead Husband Ashes : బ్రిటన్‌కి చెందిన 26 ఏళ్ల కాసీ అనే మహిళ భర్త మరణించాడు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ తరువాత ఆమె తన భర్త చితాభస్మాన్ని తెచ్చుకుంది. భర్త అంటే ఆమెకు ఎంతో ప్రాణం. దాంతో ఆమె తన తన భర్త చితాభస్మానికి తన వెంటే ఉంచుకుంటోంది. ఎక్కడికెళ్లినా దాన్ని కూడా తీసుకెళుతోంది. అలా చేయటం వల్ల తన భర్త తనతో పాటే ఉన్నట్లుగా భావిస్తోంది. అంత వరకు బాగానే ఉంది కానీ. ఆమెకు భర్తమీద ఉన్న ప్రేమ ఏ స్థాయికి వెళ్లిందంటే..భర్త చితాభస్మాన్ని ఆమె ఏదో చాక్లెట్ లా తింటూ ఎంజాయ్ చేస్తోంది. అదేమంటే నా భర్త అంటే నాకు ప్రాణం..ఆయన లేడు కాబట్టి ఆయన చితాభస్మానికే బానిస అయ్యాను అంటోంది. అది దుర్వాసన వస్తున్నా తినటం మాత్రం మానటం నా వల్లకాదు అంటోంది. దీంతో జనాలు భర్త అంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇదేం ప్రేమరా బాబూ అనుకుంటున్నారు.ఫన్నీగా కాదు ఉద్వేగంగానే..

Read more : Andhra Woman : చనిపోయిన భర్తకు గుడి కట్టిన భార్య.. నిత్యం పూజిస్తోంది!

బ్రిటన్‌కి చెందిన కాసీ 2009లో సీన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే సీన్ ఆస్తమాతో బాధపడుతు మరణించాడు. భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఆవేదన చెందుతునే ఉండేది. అంత్యక్రియలు పూర్తి అయ్యాక భర్త చితాభస్మాన్ని తెచ్చుకుంది. తాను ఎక్కడకెళ్లితే అక్కడకి తనతోపాటే తీసుకువెళ్లుతోంది. అంతేకాదు ఈ మేరకు ఆమె తన భర్త చితాభస్మాన్ని కూడా తింటున్నానని..దాన్ని తినటం ఆపలేనని దానికి నేను ఎడిట్ అయిపోయానని చెబుతోంది. ఆ చితాభస్మం కుళ్లిన వాసన వస్తున్నా..ఆమెకు మాత్రం అది చాలా ఇష్టంగా ఉంటోంది. తన భర్తపై ఉన్న ప్రేమే నాతో ఇలా చితా భస్మాన్ని తినేలా చేస్తోందని దాన్ని నేను చాలా ఇష్టంగా కొచెం కొంచెంగా తింటున్నానని చెబుతోంది.

Read more : Dasara : 50 ఏళ్ల క్రితం భర్త కట్టించిన అమ్మవారి గుడిలో ముస్లిం మహిళ ప్రత్యేకపూజలు..

ఆమె తన భర్త చనిపోయాక చాలా చాలా ఏడ్చాను. కానీ ఆయన రాడని తెలుసు. కానీ ఈ భూమి మీద నుంచి ఆయన గుర్తుల్ని శాశ్వతంగా తుడిచిపెట్టాయలని అనుకోవట్లేదని తనతోపాటు ఉన్నట్లుగా భావిస్తున్నానని అందుకే ఇలా చేస్తున్నాను అంటోంది కాసీ. అంటే నేను ఉన్నంత వరకు నా భర్త ఉంటాడు అనే భావన నాది. దీని గురించి ఎంతమంది ఎన్ని అన్నా..నేను లెక్కచేయనని నా భావనే నాకు ముఖ్యమని అంటూ..బ్రిటన్‌ టీఎల్‌సీ ఛానెల్‌లోని ‘మై స్ట్రేంజ్‌ అడిక్ట్‌’ అనే కార్యక్రమంలో కాసీ తన వింత అలవాటు గురించి తెలిపింది. దీంతో ఈ వింత అలవాటు..ఈ వింత ప్రేమ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.