Harnaam Kaur : ‘మీసం’మెలేసిన అమ్మాయి..లండన్‌ ఫ్యాషన్‌ షోలో ఆమె గడ్డమే స్పెషల్ ఎట్రాక్షన్

ఓ అమ్మాయి ‘మీసం’మెలేసింది. గడ్డంతో రికార్డు సృష్టించింది. అమ్మాయేంటీ మీసాలు గడ్డాలు ఏంటీ అనుకోవచ్చు. ఆ అమ్మాయికి మీసాలు గడ్డాలు వచ్చాయి మగవారిలాగా..వాటితోనే రికార్డులు సాధించింది.

Harnaam Kaur : ‘మీసం’మెలేసిన అమ్మాయి..లండన్‌ ఫ్యాషన్‌ షోలో ఆమె గడ్డమే స్పెషల్ ఎట్రాక్షన్

Uk's Harnaam Kaur Enters Guinness Book As The Youngest Female With A Beard

UK’s Harnaam Kaur Enters Guinness Book Female With A Beard : ఆడవారు వాళ్లు గాజులు వేసుకోవాలి,మగవారు మీసాలు, గడ్డాలు పెంచుకోవాలి. ఇది సమాజంలో ఆడవారికి మగవారికి ఉండే తేడాల్లో ఒకటి. కానీ ఈ రెండింటిలో తేడాలొస్తే..వారికి అవమానాలే. మగవారు గాజులేసుకుంటే అనుమానం చూస్తుంది సమాజం.వాడు తేడా అన్నట్లుగా. అదే అమ్మాయిలకు మీసాలు,గడ్డాలు మొలిస్తే అవమానంగా మాట్లాడుతుంది. అలా మగవారిలాగా మీసాలు గడ్డాలు వచ్చిన ఓ అమ్మాయి పడిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకుంది. కానీ తాను చేయని తప్పుకు తన ప్రాణం ఎందుకు తీసుకోవాలి? అని వచ్చిన ఓ ఆలోచన ఆమెను మిగిలిన ఆడవారికి రాని గుర్తింపు వచ్చింది.

HARNAAM KAUR, THE BEARDED BEAUTY, ENTERS GUINNESS BOOK OF RECORDS

Read more : World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

అతి చిన్న వయస్సులోనే మీసాలు గడ్డాలు ఉన్న అమ్మాయిగా గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించింది. అలాగే ఫ్యాషన్ కు మారు పేరు అయిన లండన్ ఫ్యాషన్ షోలో గడ్డాలు ఉన్న మహిళా మోడల్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది. తనలో ఉన్న లోపాన్నే గుర్తింపుగా చేసుకున్న ఆ అమ్మాయి ‘హర్మాన్‌ కౌర్‌’. ఎన్నో అవమానాలకు ఎదుర్కొని..గేలి చేసిన వారికి గుణపాఠంగా నిలిచిన సాహసం ఆమెది!!

My beard is my choice: An interview with Harnaam Kaur | Guinness World  Records

బ్రిటన్‌లో నివసించే హర్మాన్‌ కౌర్‌ 11 ఏళ్ల వయసు వచ్చేసరికి.. పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ అనే సమస్యతో మగవారిలా గడ్డాలు, మీసాలు రావడం మొదలయ్యాయి. ఈ సమస్యతో చిన్న వయసులోనే ఘోరమైన అవమానాలను అవహేళలను ఎదుర్కొంది. స్కూల్లో తోటి పిల్లలు చేసే హేళన ఆ చిన్నమనస్సుపై చెరగని ముద్ర వేసింది. కంటికి మింటికి ఏకధారగా ఏడ్చేది. స్కూలుకు వెళ్లనని ఒకటే ఏడ్చాది.

Read more: Delivered Twins:ప్రసవించిన ట్విన్స్..అక్కకు నలుగురు..చెల్లికి ముగ్గురు

వాటిని తీసేయటానికి వ్యాక్సింగ్‌ చేయించుకునేది. కానీ అలా చేసిన్ప్పుడల్లా నరకమే. ప్రతి ఐదురోజులకి బలంగా, దృఢంగా వెంట్రుకలు పెరిగిపోయేవి. చర్మం కోసుకుపోయేది. గాట్లు పడేవి. ముట్టుకుంటే నొప్పిపుట్టేంత బిరుసుగా మారిపోయేది. ఆ బాధ. అవమానాలు భరించలేక.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించింది. తరలొ లోపాన్ని అవమానంగా భావించి జీవితాన్ని అంతం చేసుకునేకంటే దాన్నే గుర్తింపుగా మలచుకోవాలనే ఆలోచన వచ్చింది. అన్ని సమస్యలకు చావు పరిష్కారం కాదని అనుకుంది. అంతే అలా అలవాటు అయిపోయిన అవమానాలను పట్టించుకోవటం మానేసింది. ధైర్యంగా బతకడం నేర్చుకుంది.

30

అలా ఇక వాక్సింగ్‌ చేయించడం ఆపేసింది. గడ్డం పెంచడం మొదలుపెట్టింది. మీసాలు షేప్‌ చేసుకుని, తలకు స్టయిల్‌గా క్లాత్‌ చుట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆహార్యాన్ని సొంతం చేసుకుంది. అవమానాల నుంచి గుర్తింపుని తెచ్చుకోవాలని అనుకుంది. అప్పట్లోనే గడ్డం ఉన్న అతి పిన్న వయసు మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. తన గడ్డానికి సుందరి అని పేరు కూడా పెట్టుకుంది ముద్దుగా మురిపెంగా.

Read more : Delivered Twins:ప్రసవించిన ట్విన్స్..అక్కకు నలుగురు..చెల్లికి ముగ్గురు

తన రూపాన్ని తన ఎడమ కాలిపై టాటూగా వేయించుకుంది. 2014లో ఆమె లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసింది. అలా అందరి దృష్టి తనమీదే పడేలా చేసుకంది తన గడ్డం మీసాలతో. గడ్డంతో ఉన్న మహిళా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది ‘హర్మాన్‌ కౌర్‌.

24-Year-Old Woman Breaks Record With Her Beard: Harnaam Kaur Makes Guinness  Book Of Records List - GhanaCelebrities.Com

అలా అవమానాలనే తన వేదికగా చేసుకుని..ఒక్కె మెట్టు ఎక్కింది. ధీరగా నిలబడింది. అవమానాలనే మెట్లుగా మలచుకంది.అనేక బ్రాండ్లకు మోడల్‌గా మారింది. నేటికీ తన జీవితాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేస్తూ..తనలాంటి సమస్య ఉన్నవారికి మోటివేషన్‌ క్లాసులు చెబుతుంటుంది. పరిష్కారం లేని సమస్యకు.. సమస్యనే పరిష్కారంగా మార్చుకున్న ధీర ‘హర్మాన్‌ కౌర్‌. అందుకే ‘నా గడ్డానికి ఒక ప్రత్యేకతుంది. ఇదొక మహిళ గడ్డం’ అని సగర్వంగా చెబుతుంది హర్మాన్ కౌర్.