Russian Soldiers Killed : రష్యాకు బిగ్‌లాస్.. యుద్ధంలో 15,600 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది.(Russian Soldiers Killed)

Russian Soldiers Killed : రష్యాకు బిగ్‌లాస్.. యుద్ధంలో 15,600 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

Russian Soldiers Killed (1)

Updated On : March 23, 2022 / 5:16 PM IST

Russian Soldiers Killed : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా యుక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ తీవ్రంగా నష్టపోయారు. అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.

తాజాగా మరోసారి యుక్రెయిన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నాలుగు వారాలుగా తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు 15వేల 600 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు యుక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. అలాగే 101 విమానాలు, 124 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలు, వాహనాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది.(Russian Soldiers Killed)

Biological Weapons On Ukraine : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

గత నాలుగు వారాలుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు పుతిన్.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు 4 వారాలుగా భీకర గెరిల్లా యద్ధం కొనసాగుతోంది. అయితే, పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో రష్యా తన సైనికులను కోల్పోతోంది.

అణ్వాయుధాల ప్రయోగం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. రష్యా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లితేనే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తామని రష్యా స్పష్టం చేసింది. యుక్రెయిన్‌ తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో మాస్కో అణ్వాయుధాల్ని వినియోగిస్తుందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో పుతిన్‌ సర్కార్ స్పందించింది. రష్యా మనుగడకు ముప్పు వాటిల్లితేనే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది.

యుక్రెయిన్‌పై ముప్పేట దాడికి రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అజోవ్‌ సముద్రం నుంచి మరియుపోల్‌ తీర ప్రాంతం వైపు యుద్ధ నౌకలు వస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నల్ల సముద్రంలో మరో 21 యుద్ధ నౌకలను రష్యా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది.

Russians Fight For Sugar : రష్యాలో దారుణ పరిస్థితులు.. చక్కెర కోసం ఎగబడ్డ జనాలు

క్రిమియా నుంచి డాన్‌బాస్‌ ప్రాంతం మీదుగా పశ్చిమ రష్యాను కలిపే భూమార్గంలో మరియుపోల్‌ పోర్టు సిటీ కీలక మార్గంలో ఉంది. దీనిని ఆధీనంలోకి తీసుకోకుండా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే అవకాశం రష్యాకు లభించదు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే రణరంగంలో రష్యా అతిపెద్ద విజయం సాధించినట్లవుతుంది.